Krithi Shetty Comments On Heroines Glamor Exposing : హీరోయిన్లను అందాలు చూపించడానికే తీసుకుంటారు.. కృతిశెట్టి కామెంట్లు వైరల్..!
NQ Staff - June 25, 2023 / 01:07 PM IST
Krithi Shetty Comments On Heroines Glamor Exposing : యంగ్ హీరోయిన్ కృతిశెట్టికి వరుసగా ప్లాపులు వస్తున్నా సరే ఆమె క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. వరుసగా సినిమాల్లో అవకావాలు వస్తూనే ఉన్నాయి. ఇంకో రెండు సినిమాలు గనక హిట్ అయి ఉంటే.. ఆమె ఇప్పటికే స్టార్ హీరోయిన్ అయిపోయి ఉండేది. కానీ ఆమెకు లక్ పెద్దగా కలిసి రాలేదు.
మూడు హిట్ల తర్వత.. వరుసగా నాలుగు ప్లాపులు రావడం అంటే బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. రీసెంట్ గా వచ్చిన కస్టడీ సినిమా కూడా ప్లాప్ అయింది. దాంతో ఆమె ఈ నడుమ అందాలను కాస్త ఘాటుగానే ఆరబోస్తోంది. అంతే కాకుండా వరసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఇందులో ఆమె హీరోయిన్ల పాత్రల గురించి మాట్లాడింది. సినిమాలకు మార్కెటింగ్ జరిగేది హీరోల ఫ్యాన్ బేస్ వల్లే. కాబట్టి హీరోయిన్లు స్క్రీన్ మొత్తం కనిపించాలని అనుకోరు. మా పాత్రలు కూడా అలాగే డిజైన్ చేస్తారు. చాలా మంది మమ్మల్ని కేవలం గ్లామర్ ఎక్స్ పోజింగ్ వరకే చూపిస్తున్నారు కదా అని అంటుంటారు.
ఒక సినిమాకు అందం తీసుకురావడంలో హీరోయిన్లదే కీలక పాత్ర. మాస్ ఎలివెంట్స్ హీరోలను బట్టి ఉంటుంది. అదే గ్లామర్ అనేది కేవలం హీరోయిన్ల వల్లే సాధ్యం అవుతుంది. అందుకే మమ్మల్ని సినిమాల్లోకి తీసుకుంటారు. అందులో తప్పేముంది అంటూ చెప్పుకొచ్చింది కృతిశెట్టి.