Krishna Vrinda Vihari Movie : కృష్ణ వ్రింద విహారి.! ఆ టైటిలేంటి.? ఆ ఘాటు పోస్టర్లేంటి.?

NQ Staff - September 10, 2022 / 08:14 PM IST

Krishna Vrinda Vihari Movie : కృష్ణ వ్రింద విహారి.! ఆ టైటిలేంటి.? ఆ ఘాటు పోస్టర్లేంటి.?

Krishna Vrinda Vihari Movie : నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. సినిమా టైటిల్ పలికేందుకు కొంత కష్టంగా వుంది కదా.? అవును మరి, ‘పోకిరి’, ‘పోరంబోకు’ టైటిల్స్ అయితే వినసొంపుగా వుంటాయ్ నేటి తరానికి. సరే, టైటిల్‌లో తెలుగుతనం బావుందిగానీ, పలకడానికి చాలా చాలా కష్టపడాల్సి వస్తోంది.

కానీ, టైటిల్‌లో వున్న తెలుగుదనం సినిమాలో వుంటుందా.? లేదా.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ షిర్లే సేటియా అయితే సూపర్ హిట్‌గా కనిపిస్తోంది. పైగా, హీరోతో ఓ ఆట ఆడేసుకుంటున్నట్లుంది.

పోస్టర్లలో ఘాటుతనం దేనికి సంకేతం.?

Krishna Vrinda Vihari Movie Official Trailer

Krishna Vrinda Vihari Movie Official Trailer

త్రివిక్రమ్ శ్రీనివాస్ పుణ్యమా అని పూజా హెగ్దే కాళ్ళకు ఎంత పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే బాటలో చాలామంది దర్శకులు హీరోయిన్ల కాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మోకాలికి ఎంత ఎక్కువ పైకి డ్రెస్సులేస్తే అంత పండగన్నమాట.

ఇక, ‘కృష్ణ వ్రింద విహారి’ ప్రోమో నేడు విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ఇప్పుడు వైరల్‌గా తయారయ్యింది. ఆ పోస్టర్లకీ టైటిల్‌కీ ఏమన్నా సంబంధం వుందా.? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదేదో ‘ఏ-గ్రేడ్’ సినిమాలా వుందన్న భావనని పోస్టర్ల కలగజేస్తున్నాయ్.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us