Kiran Kumar : నన్ను అసోసియేషన్ నుండి తొలగించారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన కిరణ్ కుమార్
NQ Staff - August 18, 2022 / 12:03 PM IST

Kiran Kumar : లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ చాలా సాఫ్ట్‌గా కూల్‌గా కనిపిస్తూ ఉంటారు. ఆయన ఎలాంటి వివాదాలకి జోలికి కూడా పోరు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపించే కిరణ్ కుమార్‌ని అసోసియేషన్ నుండి తొలగించారట. వాళ్లు చెప్పినట్టు నేను వినను అని నన్ము ఎప్పుడో అసోసియేషన్ నుండి తీసేసారని కిరణ్ కుమార్ చెప్పారు.
అందుకే తీసేసారు..
వాళ్లలాగే నేను వ్యాపారం చేయాలంటే ఎలా? నాకు నచ్చినట్టు నేను వ్యాపారం చేస్తాను. నేను తక్కువగా, ఫ్రీగా ఎలా ఇస్తున్నాను అనేది నా ఇష్టం. న్యా వ్యాపారం కాబట్టి నాకు నచ్చినట్టు చేసుకుంటా. వాళ్లు నాకు వ్యాపారం నేర్పిస్తా అంటే ఎలా. నన్ను అసోసియేషన్ నుండి తీసేస్తానంటే తీసేయని చెప్పారు. అసోసియేషన్‌కి సంవత్సరానికి కొంత కట్టాలి. పది సంవత్సరాల నుండి అది కూడా ఆగిపోయిందని కిరణ్ కుమార్ చెప్పుకొచ్చారు.

Kiran Kumar was Removed From Association
ఒకప్పుడు కిరణ్ కుమార్ కెనడా, లండన్, సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు మంచి ఎగుమతిదారుగా ఉండేవారు.ఇక్కడ మన దేశంలో కేరళ, చెన్నై, హైదరాబాద్‌లో కొన్ని జువెలర్స్‌కు నిరంతరం బంగారం సరఫరా చేశారు. నెల్లూరులో బంగారు వ్యాపారంలో పనిచేసే వారు ఆయనకు మంచి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, తన కుటుంబ సభ్యుల్లాగా వ్యవహరించారని కిరణ్ సంతోషిస్తుంటారు.
లలితా జువెలర్స్ తయారు చేయించే డిజైన్లు ముంబయి, రాజ్‌కోట్, కోల్‌కత, కేరళ, కొయంబత్తూర్ ప్రాంతాల అభిరుచుల సమాహారంగా నిలుస్తాయి. బంగారు నాణ్యతలో రాజీ ఉండదని దాని వ్యవస్థాపకులు చెబుతారు.