Kiran Kumar : ల‌లితా జ్యువెల‌ర్ ఓన‌ర్‌కి ఫేవ‌రేట్ స్టార్స్ ఉన్నారా.. పుష్ప‌పై ఆయ‌న స్పంద‌న ఏంటి?

Sravani Journalist - August 16, 2022 / 09:40 AM IST

151553Kiran Kumar  : ల‌లితా జ్యువెల‌ర్ ఓన‌ర్‌కి ఫేవ‌రేట్ స్టార్స్ ఉన్నారా.. పుష్ప‌పై ఆయ‌న స్పంద‌న ఏంటి?

Kiran Kumar  : తల్లి గాజులు అమ్మేసిన పరిస్థితి నుండి వేల కోట్ల బిజినెస్‌ను విస్థరించిన కిరణ్‌ కుమార్ జీవితం అందరికి ఆదర్శనీయం.కష్టపడి, నమ్మకంతో పని చేస్తే ఖచ్చితంగా ఉన్నత శిఖరాలు ఎక్కవచ్చు అనేది కిరణ్‌ కుమార్‌ గారి జీవితం ద్వారా నేర్చుకోవాలి. ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్న కిర‌ణ్ కుమార్ రోజులో ఐదు గంటలు మాత్ర‌మే పడుకుంటార‌ట‌.

త‌గ్గేదే లే..

Kiran Kumar Said That Allu Arjun Work Hard for Pushpa Movie

Kiran Kumar Said That Allu Arjun Work Hard for Pushpa Movie

మ‌ధ్యాహ్నాం ప‌డుకునే అల‌వాటు ఉందా లేద‌నే అంటున్నారు. ఇక సినిమాలు చూసే అల‌వాటుందా అంటే థియేట‌ర్స్‌కి వెళ్లిన సంద‌ర్భాలే లేవ‌ని చెబుతున్నారు. ఓటీటీలో మాత్రం అప్పుడ‌ప్పుడు చూస్తానన్నారు. రీసెంట్‌గా పుష్ప సినిమా చూశాను. అందులో త‌గ్గేదే లే అని ఉంటుందిగా.. ల‌లితా జ్యువ‌లెర్స్ .. త‌గ్గేదే లే అంటూ త‌న‌దైన స్టైల్‌లో మేన‌రిజం ప్ర‌ద‌ర్శించారు.

పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ చాలా క‌ష్ట‌ప‌డి ఉంటార‌ని కూడా చెప్పుకొచ్చారు. త‌న‌కు చిరంజీవి, కృష్ణ‌, కృష్ణం రాజు అంటే ఇష్ట‌మ‌ని చెప్పిన కిర‌ణ్ కుమార్ త‌మిళంలో ఏ హీరో అంటే ఇష్టం అని అడ‌గ‌గా, నాకు ఆ స‌మ‌యంలో ఏ హీరో యాక్టింగ్ బాగా చేస్తే ఆ హీరో న‌చ్చుతాడు. ముఖ్యంగా ప‌నిత‌నం న‌చ్చాలి. యాక్టింగ్ చేసిన‌ట్టు కాకుండా రియాలిటీగా అనిపించాలి అని అన్నాడు.

ఏ హీరోయిన్ ఇష్ట‌మ‌ని అడ‌గ‌గా, దానికి ఎవ‌రు లేర‌నే స‌మాధాన‌మే ఆయ‌న ద‌గ్గ‌ర నుండి వ‌చ్చింది. ఇక 75 పైస‌ల‌కే నేను సినిమా చూశాను అంటూ త‌న పాత జ్ఞాప‌కాల‌ను కూడా గుర్తు చేసుకున్నారు కిర‌ణ్ కుమార్.