Kiran Kumar : ల‌లితా జ్యుయ‌ల‌రీస్ య‌జ‌మాని ఎప్పుడు టీ ష‌ర్ట్‌లోనే క‌నిపిస్తారు.. కార‌ణం ఏమైన ఉందా?

Sravani Journalist - August 16, 2022 / 09:40 AM IST

151544Kiran Kumar : ల‌లితా జ్యుయ‌ల‌రీస్ య‌జ‌మాని ఎప్పుడు టీ ష‌ర్ట్‌లోనే క‌నిపిస్తారు.. కార‌ణం ఏమైన ఉందా?

Kiran Kumar : ల‌లితా జ్యుయ‌ల‌రీస్ య‌జ‌మాని కిర‌ణ్ కుమార్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. డబ్బులు ఊరికే రావు.. అనే మాటలు వినగానే తెలుగు వారి మదిలో ఆయ‌న రూపం మెదులుతుంది. ఆ వెంటనే ముఖంపై చిన్న చిరునవ్వు వెల్లివిరుస్తుంది. తెలుగు కమర్షియల్ యాడ్స్ రంగంలోనే ఓ విప్లవానికి నాంది పలికిన కిర‌ణ్ కుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ న‌లుగురికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

కిర‌ణ్ కుమార్ రూపం గురించి మాట్లాడాలంటే

Kiran Kumar Exclusive Interview

Kiran Kumar Exclusive Interview

ఆయ‌న గుండుతో పాటు టీ ష‌ర్ట్‌, క‌ళ్ల‌కు అద్దాలు, క్లీన్ షేవ్‌తో నిగ‌నిగ‌లాడుతూ క‌నిపిస్తుంటారు. అయితే కిర‌ణ్ కుమార్‌ని ష‌ర్ట్‌లో చూసింది లేదు. ఎప్పుడు రంగురంగుల టీ ష‌ర్ట్‌లో క‌నిపించే ఆయ‌న తాజ‌గా సీక్రెట్ రివీల్ చేశారు. ష‌ర్ట్స్ వేసుకోక‌పోవ‌డానికి ఏమైన సెంటి మెంట్ ఉందా అని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా, అలాంటిది ఏమి లేద‌ని అన్నాడు.

ష‌ర్ట్ వేసుకోవాలి అంటే ఎనిమిది బ‌టన్స్ పెట్టుకోవాలి, అదే టీ ష‌ర్ట్ వేసుకుంటే రెండు బ‌టన్స్ పెట్టుకుంటాం. టైం క‌లిసి వ‌స్తుంద‌ని స‌ర‌దాగా బ‌దులిచ్చారు. అయితే ఫ్యూచ‌ర్‌లో ష‌ర్ట్‌లో చూసే అవ‌కాశం ఏమైన ఉందా అంటే త‌ప్ప‌కుండా అని చెప్పుకొచ్చారు. మొత్తానికి కిర‌ణ్ కుమార్ ష‌ర్ట్ వేసుకోక‌పోవ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం ఏమి లేద‌ని తాజా ఇంట‌ర్వ్యూతో అంద‌రికి ఓ క్లారిటీ వ‌చ్చింది.