Kiara Advani : కియారా కిల్లింగ్ ఫోజులు.. మ‌తులు పోతున్నాయంటున్న నెటిజ‌న్స్

Kiara Advani : ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ కియారా అద్వాని. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభినయంతో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న కియారా ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తోంది.కియారా ఎక్కువ‌గా బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతుంది. ఎక్కువ‌సేపు జిమ్‌లో గ‌డిప‌డం ఈ బ్యూటీకి అల‌వాటు.

Kiara Advani new photos
Kiara Advani new photos

ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మారిన కియారా అద్వాని .. రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో న‌టించింది. తర్వాత నుండి తెలుగులో మరో సినిమా చేయలేదు కియారా. కానీ హిందీలో మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ.. అదరగొడుతోంది. ఈ బ్యూటీ హిందీలో ‘లస్ట్ స్టోరీస్’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్‌లో కాస్తా ఘాటుగానే నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.

Kiara Advani new photos
Kiara Advani new photos

కియారా న‌టించిన‌ ‘ఇందూకి జవానీ’ అనే సినిమా లో బోల్డ్ పాత్రలో నటించింది. కియారా ఈ సినిమాలో డేటింగ్ యాప్స్‌ను నమ్మి మోసపోయే అమ్మాయి పాత్రలో కనిపించింది. చేసే ప్ర‌తి పాత్ర వైవిధ్యంగా ఉండాల‌ని భావించే ఈ ముద్దుగుమ్మ శంక‌ర్ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర చేస్తుంద‌ని అంటున్నారు.

Kiara Advani new photos
Kiara Advani new photos

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కియారా అద్వాని ఎప్పటిక‌ప్పుడు అంద‌చందాల‌తో అల‌రిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ స్ట‌న్నింగ్ లుక్‌లో మెరిసింది. కియారా క్యూట్ లుక్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఎంత అందంగా ఉన్నావు కియారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉన్న నటి కియారా అద్వానీ. అందంతోనే కాకుండా అభినయంతోనూ సినీ ప్రేక్షకులను ఆకట్టకుంది ఈ బ్యూటీ. ఎంఎస్‌ ధోనీ, కబీర్‌ సింగ్‌, లక్ష్మీ, లాంటి సూపర్ హిట్‌ బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇటీవ‌ల ఓ ల‌గ్జ‌రీ కారు కొన్న విష‌యం తెలిసిందే.