Khushi Movie : ‘ఖుషీ’ నాన్ థియేట్రికల్ రైట్స్.! ఆకాశాన్నంటేసిందోచ్.!
NQ Staff - November 8, 2022 / 07:00 PM IST

Khushi Movie : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాతో దారుణమైన ఫ్లాప్‌ని చవిచూసిన విషయం విదితమే. అయినాగానీ, విజయ్ దేవరకొండ తదుపరి సినిమాపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు.
సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తోన్న ‘ఖుషీ’ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయ్. తాజాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయమై హాట్ హాట్ ఇన్ఫో బయటకు వస్తోంది. తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి నాన్ థియేట్రికల్ రైట్స్ 92 కోట్లకు అమ్ముడు పోయాయట.
టేబుల్ ప్రాఫిట్స్..
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. సమంత ఇటీవల ‘మయోసైటిస్’ కారణంగా ఆసుపత్రి పాలవడంతో, ఆమె కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ కారణంగా సినిమా తదుపరి షెడ్యూల్ ఆలస్యమవుతోంది.
కాగా, నాన్ థియేట్రికల్ రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడవడానికి ప్రధాన కారణం విజయ్ దేవరకొండ, సమంత కాంబోపై వున్న క్రేజ్ అని అంతా అంటున్నారు. నాన్ థియేట్రికల్ రైట్స్‌కే (అన్ని భాషలూ కలిపి) ఈ స్థాయి డిమాండ్ అంటే, థియేట్రికల్ బిజినెస్ ఎలా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైత్రీ మూవీ మేకర్స్ అప్పుడే టేబుల్ ప్రాఫిట్స్ పొందిందని తెలుస్తోంది.