Ketika Sharma : క్యూట్ లుక్స్‌లోనూ ‘రొమాంటిక్‌’గా అగ్గి రాజేస్తోన్నకేతిక.!

NQ Staff - September 26, 2022 / 09:00 PM IST

Ketika Sharma : క్యూట్ లుక్స్‌లోనూ ‘రొమాంటిక్‌’గా అగ్గి రాజేస్తోన్నకేతిక.!

Ketika Sharma : సోషల్ మీడియా నుంచి డైరెక్ట్‌గా పెద్ద తెరకు ప్రమోట్ అయిపోయిన ముద్దుగుమ్మ కేతిక శర్మ. అదృష్టం కలిసి రావడమంటే ఇదే మరి. అలా కలిసొచ్చిన అదృష్టం కేతికకు సక్సెస్ అందివ్వడంలో కలిసి రావడం లేదు. అవకాశాలైతే వస్తున్నాయ్ కానీ, కెరీర్‌కి అవి ఎంత వరకూ యూజ్ అవుతున్నాయంటే అదో ప్రశ్నార్ధకంగానే మారిపోయింది పాపం కేతిక విషయంలో.

Ketika Sharma new cute photos

Ketika Sharma new cute photos

‘రొమాంటిక్’ సినిమాతో పూరీ కంపెనీ నుంచి దిగుమతి అయిన ఘాటు అందాల బ్యూటీ కేతిక శర్మ. తనకున్న యూ ట్యూబ్ క్రేజ్‌తో తొలి సినిమా రిలీజ్‌కి ముందు చేసిన గ్లామర్ హంగామా అంతా ఇంతా కాదు.

ఆ విషయంలో కేతికను మెచ్చుకోవాల్సిందే సుమీ.!

అయితే, సినిమా రిలీజ్ తర్వాత తుస్సుమంది ఆ క్రేజ్ అంతా. కేవలం ప్రోమోలకు మాత్రమే పరిమితమైన షో కేస్ బొమ్మగా కేతికను తేల్చేశారు. ఆ తర్వాత నాగశౌర్యతో ఓ సినిమాలో నటించింది. ఆ సినిమాలో అస్సలు గ్లామర్‌కే చోటు లేకుండా పోయింది పాపం కేతికకు.

Ketika Sharma new cute photos

Ketika Sharma new cute photos

ఇక ముచ్చటగా మూడో సినిమా కోసం ఏకంగా మెగా కాంపౌండ్‌నే టచ్ చేసేసిందీ హాట్ అందాల పోరి. కానీ, మూడో సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ముక్కలయ్యింది. ఈ సినిమాలో కేతిక గ్లామర్‌ని బాగానే వాడేశారనుకోండి. సక్సెస్ వస్తేనే కదా.. సోదిలో నిలిచేది.

అలా కేతిక రేస్‌లో వెనకబడిపోయింది. హిట్టూ, ఫ్లాపూ ఎలా వున్నా, తన పని మాత్రం తాను కామ్‌గా చేసుకుంటూ పోతోంది కేతిక శర్మ. తన స్ర్టెంత్ అయిన సోషల్ మీడియాలో ఎప్పటిలాగే తన ప్రతాపం చూపిస్తోంది. ఓవర్ డోస్ గ్లామర్‌తో కుర్రోళ్ల మతులు పోగొడుతోంది. తాజాగా ఎల్లో కలర్ డ్రస్‌లో కేతిక శర్మ అందాలు కాక పుట్టిస్తున్నాయ్. అందానికి అందం ఓ ఎత్తు.. అమ్మడి రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇంకో ఎత్తు. కావాలంటే మీరూ ఓ లుక్కేస్కోండి.

Ketika Sharma new cute photos 1 1

Ketika Sharma new cute photos

Ketika Sharma new cute photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us