Keerthy Suresh Political Entry Update : పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న కీర్తి సురేష్.. స్వయంగా తెలిపిన మహానటి..!
NQ Staff - June 26, 2023 / 12:26 PM IST

Keerthy Suresh Political Entry Update : సినీ రంగానికి, రాజకీయాలకు దగ్గరి అనుంబంధం ఉంటుంది. ఎందుకంటే గతంలో చాలామంది స్టార్లు సినీ ఎంట్రీ ఇచ్చి సీఎంలు కూడా అయ్యారు. ఇప్పటికీ చాలామంది మంచి పొజీషన్ లో ఉన్నారు. హీరోయిన్లు కూడా రాజకీయ ఎంట్రీ ఇవ్వడం కామన్ అయిపోయింది. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఇదే బాట పడుతోంది.
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అయితే తాజాగా ఆమె నటించిన మూవీ మామన్నన్. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తుండగా వడివేలు కీలక రోల్ చేస్తున్నారు. ఈ మూవీ పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతోంది. ఈ సినిమా జూన్ 29న విడుదల కాబోతోంది.
దీంతో మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ పాల్గొనగా.. పొలిటికల్ ఎంట్రీ పై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ఈ నడుమ అందరూ పొలిటికల్ ఎంట్రీ గురించి అడుగుతున్నారు. దీనిపై ఆలోచించాలి అంటూ తెలిపింది. అంటే ఆమెకు కూడా ఇంట్రెస్ట్ ఉందని అర్థం అవుతోంది.
ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే రాజకీయాల్లోకి రాను అని తెలిపేది. కానీ ఆలోచిస్తాను అని తెలిపిందంటే మాత్రం కచ్చితంగా ఆమెకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట. గతంలో ఆమె బీజేపీలో జాయిన్ కాబోతోంది అంటూ వార్తలు వస్తే ఆమె ఖండించింది. మరి ఇప్పుడు ఏ పార్టీలో చేరుతుందో చూడాలి.