Keerthy Suresh : కీర్తి సురేష్ కు కొత్త లవర్ దొరికాడోచ్.. సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగ్..!

NQ Staff - June 22, 2023 / 12:31 PM IST

Keerthy Suresh  : కీర్తి సురేష్ కు కొత్త లవర్ దొరికాడోచ్.. సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగ్..!

Keerthy Suresh  : కీర్తి సురేష్ కెరీర్ పరంగా మంచి పొజీషన్ లో ఉంది. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలు అన్నీ ఆమెకు మంచి పేరు తీసుకువచ్చాయి. పైగా నటనలో మహానటిగా గుర్తింపు పొందింది. ఎలాంటి ఛాలెంజింగ్ పాత్ర అయినా సరే చేసేస్తోంది. అయితే ఆమె కొంత కాలంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది.

ఎందుకంటే ఆమె కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తితో ఫొటో దిగి పోస్టు చేసింది. ఇందులో ఇద్దరి సన్నిహిత్యం చూసి ఆమె కీర్తి లవర్ కావచ్చు అంటూ అంతా వార్తలు వైరల్ చేసేశారు. దెబ్బకు కీర్తి స్వయంగా స్పందించాల్సి వచ్చింది. అతను తన ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. ఇదే విషయం మీద ఆమె తండ్రి కూడా స్పందించారు.

ఇక తాజాగా కీర్తి సురేష్ మరో వ్యక్తితో దిగిన ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో కూడా అతనితో చాలా క్లోజ్ గా ఫొటోలు దిగింది. ఓ ఫొటోలో అతను ఆమె భుజం మీద తల వాల్చాడు. మరో ఫొటోలో ఆమె అతనిపై చేయి వేసింది. ఇద్దరి మధ్య చనువు చూసిన ఫ్యాన్స్ మళ్లీ కీర్తి సురేష్ లవర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇందుకు సంబంధించిన పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ ఇంతగా పేరు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సారి కొత్త లవర్ ను వెతికారన్న మాట అంటూ కీర్తి సురేష్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటివి అనవసరంగా పెట్టి ఆమె ఇమేజ్ దెబ్బ తీయొద్దు అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు ఆమె అభిమానులు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us