Keerthy Suresh : మెరుపు తీగ‌లా మారిన కీర్తి సురేష్‌.. క్యూట్ అందాల‌తో కేక పెట్టిస్తున్న మ‌హాన‌టి

Keerthy Suresh : కేవ‌లం గ్లామర్‌తోనే కాకుండా ఫెర్ఫార్మెన్స్‌తో అద్భుతమైన ప్రతిభను చాటుకొన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. నట వారసత్వాన్ని, సినీ నేపథ్య కుటుంబం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించారు. అయితే చిన్న చిన్న పాత్రలతో ఆలరిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగారు. దక్షిణాది సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నారు. ఇటు తెలుగు, అటు త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

Keerthy Suresh new photo shoot
Keerthy Suresh new photo shoot

ఓ వైపు స్టార్ యాక్ట‌ర్స్‌తో భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ వ‌స్తున్నారు కీర్తి సురేష్‌. ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన కొన్ని సినిమాలు క‌రోనా ప్ర‌భావంతో థియేట‌ర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. పెంగ్విన్‌, మిస్ ఇండియా చిత్రాలు ఓటీటీలోనే డైరెక్ట్ రిలీజ్ అయ్యాయి. ఈ వ‌రుస‌లో కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ఓ వైవిధ్య‌మైన చిత్రం ఓటీటీలోనే డైరెక్ట్ రిలీజ్ కాబోతుంది.

Keerthy Suresh new photo shoot
Keerthy Suresh new photo shoot

మ‌హాన‌టితో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న త‌ర్వాత కీర్తి సురేష్ ఓ వైపు గ్లామ‌ర్ పాత్ర‌లు చేస్తూనే, డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. అలా కీర్తిసురేష్ న‌టిస్తోన్న ఓ త‌మిళ చిత్రం సానికాయిదం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇందులో కీర్తిసురేష్‌తో పాటు ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌న‌వ్ కూడా న‌టిస్తున్నారు. ఆయ‌న న‌టిస్తోన్న తొలి చిత్ర‌మిదే. గ‌తంలో కీర్తి సురేష్ న‌టించిన పెంగ్విన్ చిత్రాన్ని విడుద‌ల చేసిన ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు సాని కాయిదం సినిమాను విడుద‌ల చేయ‌నుంద‌ని స‌మాచారం.

Keerthy Suresh new photo shoot
Keerthy Suresh new photo shoot

మ‌రోవైపు కీర్తి న‌టిస్తున్న గుడ్ ల‌ఖ్ స‌ఖి చిత్రం జ‌న‌వ‌రి 28న విడుద‌ల కానుంది. కీర్తీ సురేష్ ఇటీవల రంగ్ దే, అన్నాతే, మరక్కార్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం మహేష్ బాబుతో సర్కారు వారీ పాట, చిరంజీవితో భోళా శంకర్ చిత్రాల్లో నటించబోతున్నది. అంతేకాకుండా మలయాళంలో వాషి, తమిళంలో సాని కాయిధామ్ చిత్రాలతోపాటు నానితో కలిసి దసరా అనే సినిమాలో విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నది.

త‌న క్యూట్‌నెస్‌తో అభిమానుల‌ని మంత్ర‌ముగ్ధుల‌ని చేసే కీర్తి సురేష్ తాజాగా స్ట‌న్నింగ్ లుక్‌లో మెరిసింది. కీర్తి క్యూట్ లుక్ కి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. క్యూట్ లుక్స్ లో మ‌తులు పోగొడుతున్నావంటూ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు.