Keerthi Keshav Bhat : శ్రీహాన్ కంటే కీర్తి బెటర్.! నెటిజన్లు తేల్చేస్తున్నారు.!
NQ Staff - December 19, 2022 / 02:34 PM IST

Keerthi Keshav Bhat : డే వన్ నుంచీ మంచి ఎంటర్టైనర్గా బిగ్ బాస్ సీజన్ సిక్స్‌లో సత్తా చాటాడు శ్రీహాన్. డాన్సులేశాడు, కామెడీ చేశాడు.. టాస్కుల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ, ఏం లాభం.? మొత్తం అన్ని రోజులూ ఆడింది ఓ యెత్తు.. చివరి రోజులు చేతులెత్తేసింది ఇంకో యెత్తు.!
శ్రీహాన్‌కి నలభై లక్షలొచ్చాయ్.. అదీ రన్నరప్ అయినందుకు కాదు.. విజేత స్థానాన్ని కాదనుకున్నందుకు.! ఔను అనుమానంతో విజేత స్థానాన్ని ముందే వదులుకున్నాడు శ్రీహాన్.
కీర్తి చాలా చాలా బెటర్..
శ్రీహాన్ కంటే కీర్తి చాలా చాలా బెటర్. శ్రీహాన్ కంటే కూడా కీర్తికే డబ్బు అవసరం ఎక్కువ. కానీ, శ్రీహాన్ ఆలోచించినట్లు డబ్బు కోసం కీర్తి ఆశపడలేదు. నిజానికి, కీర్తి అలాగే శ్రీహాన్ కూడా తొలుత డబ్బుకి ఆశపడలేదు.
ఎప్పుడైతే కీర్తి ఔట్ అయిపోయిందో, ఆ తర్వాత శ్రీహాన్‌లో అనుమానం పెరిగిందా.? లేదంటే, అమౌంట్ పెంచడంతో శ్రీహాన్ టెంప్ట్ అయ్యాడా.? కారణమేదైతేనేం, కీర్తి – శ్రీహాన్.. ఈ ఇద్దర్నీ పోల్చి చూసినప్పుడు, కీర్తి విన్నర్ అనే అభిప్రాయం కలుగుతోంది చాలామందికి.
శ్రీహాన్ ప్లేస్‌లో నేనుంటే, ఆ నలభై లక్షలకు ఆశపడేదాన్ని కాదని కీర్తి చెప్పడంతో.. శ్రీహాన్ ఇమేజ్ దారుణంగా పడిపోయింది.