KCR : కేసీయార్ ‘తెలంగాణ వెలుపల రాజకీయం’ అట్టర్ ఫ్లాప్.!

NQ Staff - September 1, 2022 / 11:06 PM IST

KCR : కేసీయార్ ‘తెలంగాణ వెలుపల రాజకీయం’ అట్టర్ ఫ్లాప్.!

KCR : వున్నదీ పోయె.. వుంచుకున్నదీ పోయె.. అన్నట్టు తయారవుతుందా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితి.? అంటే, ఔననే చర్చ సర్వత్రా జరుగుతోంది. తెలంగాణలోనూ రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయ్.. తెలంగాణలోనూ నిరుద్యోగులు ప్రభుత్వం మీద మండిపడుతున్నారు.

KCR politics outside Telangana utter flop

KCR politics outside Telangana utter flop

మరి, బంగారు తెలంగాణ ఎక్కడ.? ఆ మోడల్ దేశమంతా అమలు చేస్తామంటే ఎలా.? ‘కేంద్రం, తెలంగాణపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.. తెలంగాణను చీకటిలోకి నెట్టేయాలని చూస్తోంది..’ అంటూ ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల విషయమై ‘డైవర్షన్’ రాజకీయం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

మిత్రుడే కదా.. నచ్చజెప్పుకోవచ్చు కదా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు బిడ్డ లాంటివాడనీ.. ఆయనకు తాను పెద్దన్న లాంటోడిననీ చెబుతుంటారు కేసీయార్. రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి పని చేస్తే బావుంటుందనీ చెబుతారు. అంతేనా, 2019 ఎన్నికల్లో పరోక్షంగా వైసీపీకి కేసీయార్ అండ్ టీమ్ సహకరించిన మాట వాస్తవం.

అలాంటప్పుడు, తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిలపై కలిసి కూర్చుని చర్చించుకోవచ్చు కదా.? అవి మానేసి, ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ, కేంద్రం మీద విమర్శలు చేస్తే ఏం లాభం.? ఈ చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతోంది. ఒకప్పటి తెలంగాణ సమాజం కాదు.. ఇప్పుడు చాలా మారింది. రాజకీయంగా మరింత చైతన్యం వచ్చింది. అది తెలంగాణ రాష్ట్ర సమితి కల్లబొల్లి ప్రచారాన్ని అర్థం చేసుకుంటోందని బీజేపీ నేతలంటున్నారు.

కేసీయార్ ‘తెలంగాణ వెలుపల రాజకీయం’ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నది బీజేపీ వాదన.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us