Kartikeya 2 Collections : ‘కార్తికేయ-2’ ఫస్ట్ డే అదుర్స్: 38 శాతం రికవరీ.!

NQ Staff - August 14, 2022 / 12:56 PM IST

151573Kartikeya 2 Collections : ‘కార్తికేయ-2’ ఫస్ట్ డే అదుర్స్: 38 శాతం రికవరీ.!

Kartikeya 2 Collections : నిఖిల్ సిద్దార్ధ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ-2’ సినిమా తొలి రోజు అదరగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ‘కార్తికేయ-2’ ఓపెనింగ్స్ అదిరిపోయాయ్.! నిఖిల్ సిద్దార్ధ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌గా ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు.

మొత్తంగా తొలి రోజు 9 కోట్ల రూపాయల గ్రాస్‌ని ప్రపంచ వ్యాప్తంగా ‘కార్తికేయ-2’ రాబట్టింది. షేర్ లెక్కల్లో చూసుకుంటే ఇది 5.1 కోట్లుగా చెప్పొచ్చు. తొలి రోజు ఏకంగా 38 శాతం రికవరీ సాధించిందని ట్రేడ్ వర్గాలు ‘కార్తికేయ-2’ గురించి చెబుతున్నాయి.

లిమిటెడ్ థియేటర్లతోనే సాధ్యమైంది..

Kartikeya 2 Collections World wide

Kartikeya 2 Collections World wide

తొలి రోజు లిమిటెడ్ స్క్రీన్స్ దక్కాయి ‘కార్తికేయ-2’ సినిమాకి. అందుక్కారణం, ఈ సినిమాకంటే ఒక్కరోజు ముందు ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా విడుదలవడమే. కాగా, రెండో రోజు అదనంగా థియేటర్లను యాడ్ చేస్తుండడంతో, మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్ళు ఎక్కువగా వుంటాయని అంచనా వేస్తున్నారు.

అన్నీ అనుకుననట్లు జరిగితే, రెండో రోజుకే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వొచ్చన్నది ట్రేడ్ వర్గాల అంచనా. ఎటూ సోమవారం కూడా సెలవు కావడంతో, నేడు కాకపోతే.. రేపైనా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ‘కార్తికేయ-2’.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ‘కార్తికేయ-2’ సినిమాకి మంచి అప్లాజ్ లభిస్తోంది. కృష్ణుడి ఫ్యాక్టర్ ఈ సినిమాకి అదనపు బోనస్ అవుతోంది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.