Karthikeya 2 : ‘కార్తికేయ-2’: నిఖిల్ సిద్దార్ధ సుడి మామూలుగా లేదు.!
NQ Staff - August 13, 2022 / 10:12 AM IST

Karthikeya 2 : లేట్ అయితేనేం, లేటెస్ట్‌గా వచ్చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ తన తాజా చిత్రం ‘కార్తికేయ-2’తో. మరికొద్ది గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి, నేడే (ఆగస్టు 12) విడుదలవ్వాల్సిన ఈ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ కారణంగా, కొన్ని సినీ రాజకీయాల కారణంగా 13వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఆ మాటకొస్తే, గత నెలలోనే ‘కార్తికేయ-2’ థియేటర్లలోకి వచ్చి వుండాల్సింది. సరే, ఆ వ్యవహారాల్ని పక్కన పెడితే, అనూహ్యమైన రీతిలో ‘కార్తికేయ-2’ సినిమాకి హైప్ క్రియేట్ అయ్యింది. బహుశా నిఖిల్ కూడా ఈ స్థాయి హైప్‌ని ఊహించి వుండడు.
పాన్ ఇండియా క్రేజ్..

Karthikeya 2 Nikhil Siddharth Movie buzz
తెలుగులోనే కాదు, పలు ఇతర భాషల్లోనూ ‘కార్తికేయ-2’ సినిమాని విడుదల చేస్తున్నారు. ‘కృష్ణుడు’ ఫ్యాక్టర్ ఈ సినిమాకి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా సగటు సినీ ప్రేక్షకుడు ఇప్పుడీ ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తుండడం గమనార్హం.
ఏమాత్రం పాజిటివ్ టాక్ ఈ ‘కార్తికేయ-2’ సినిమాకి వచ్చినా, నిఖిల్ సిద్దార్ధకి ఈ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు దక్కతుందన్నది నిర్వివాదాంశం. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ-2’లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించాడు.