Karthikeya 2 : ‘కార్తికేయ’ శాపం.. వాళ్ళకి గట్టిగానే తగిలిందా.?

NQ Staff - August 14, 2022 / 09:44 AM IST

Karthikeya 2 : ‘కార్తికేయ’ శాపం.. వాళ్ళకి గట్టిగానే తగిలిందా.?

Karthikeya 2 : ఓ సినిమా విడుదల వాయిదా పడటానికి చాలా కారణాలుంటాయి. కానీ, బలమైన కారణాల్లేకుండానే ‘కార్తికేయ-2’ సినిమాకి పదే పదే వాయిదాల సమస్య ఎదురైంది. సినీ పరిశ్రమలోని రాజకీయాలు ‘కార్తికేయ-2’ సినిమాని వెనక్కి నెట్టేశాయన్నది బహిరంగ రహస్యం.

Karthikeya 2 Movie intersting update

Karthikeya 2 Movie intersting update

‘నాకే ఎందుకిలా అవుతోంది.?’ అంటూ ‘కార్తికేయ-2’ హీరో నిఖిల్ సిద్దార్ధ ఈ మధ్యనే ఓ సందర్భంలో వాపోయాడు కూడా. సినిమా అంటేనే, అనేక వ్యవప్రయాసలకోర్చి చేసే తపస్సులాంటిది. సరే, అన్ని సినిమాలూ విజయం సాధించాలనే రూల్ ఏమీ లేదు. కొన్ని చెత్త సినిమాలూ వస్తాయ్. అది వేరే సంగతి.

‘కార్తికేయ-2’ వచ్చిందిగానీ..

ఎలాగైతేనేం, ‘కార్తికేయ-2’ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాని వెనక్కి నెట్టేసిన ‘మాచర్ల నియోజకవర్గం’ (విడుదల విషయంలో) దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. దాంతో, ‘కార్తికేయ’ శాపం, ‘మాచర్ల’కు తగిలిందనే చర్చ సర్వత్రా వ్యక్తమవుతోంది.
మరోపక్క, ‘కార్తికేయ-2’ సినిమా గతంలో ‘థాంక్యూ’ సినిమా కారణంగా వెనక్కి వెళ్ళింది. ఆ సినిమాకి సైతం ‘కార్తికేయ’ శాపం తగిలిందన్ని సినీ వర్గాల్లో వినిపిస్తోన్న వాదన. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. నిఖిల్ అభిమానులు, ‘నిన్ను తొక్కేయాలనుకున్నారు.. వాళ్ళే దెబ్బ తిన్నారు..’ అంటూ నిఖిల్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లతో హోరెత్తించేస్తున్నారు.
మొత్తమ్మీద, ‘కార్తికేయ-2’ సినిమాతో నిఖిల్ ఇంకో తరహా క్రేజ్ సొంతం చేసుకున్నాడన్నమాట.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us