Karthikeya 2 : ‘కార్తికేయ-2’ : నిఖిల్ 50 కోట్ల క్లబ్బులో చేరబోతున్నాడా.?

NQ Staff - August 16, 2022 / 11:04 PM IST

Karthikeya 2 : ‘కార్తికేయ-2’ : నిఖిల్ 50 కోట్ల క్లబ్బులో చేరబోతున్నాడా.?

Karthikeya 2 : నాలుగో రోజు బాక్సాఫీస్ వద్ద ‘కార్తికేయ-2’ ప్రభంజనం కొనసాగింది. వీకెండ్ ముగిసి, సాధారణ రోజులు వచ్చేసినా ఎక్కడా తగ్గేదే లే అంటున్నాడు ‘కార్తికేయ-2’. దాంతో, ఈ సినిమా ఫుల్ రన్ విషయమై ఇంట్రెస్టింగ్ బజ్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

Karthikeya 2 Movie collections

Karthikeya 2 Movie collections

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘కార్తికేయ’, ఈ నెల 12న విడుదల కావాల్సి వుండగా, అనివార్య కారణాలతో ఒక్కరోజు ఆలస్యంగా విడుదలైన సంగతి తెలిసిందే.

లేట్ అయినా, లేటెస్టుగా వచ్చేసిన నిఖిల్..

ఒక్కరోజు ఆలస్యం అయితేనేం, బంపర్ హిట్టు కొట్టేశాడు నిఖిల్ ‘కార్తికేయ’ సినిమాతో. ప్రస్తుతం వున్న పరిస్థితుల్ని బట్టి చూస్తోంటే, ఓన్లీ తెలుగు వెర్షన్‌తో 40 కోట్ల రన్ వుండొచ్చని ట్రేడ్ పండితులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఏదన్నా అద్భుతం జరిగితే మాత్రం 50 కోట్లు కూడా టచ్ చేయవచ్చునట.

ఈ రోజుల్లో ఏదీ అసాధ్యం కాదు. ఎందుకంటే, థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్నారు. పైగా, ‘కార్తికేయ-2’ సినిమాకి మౌత్ టాక్ ప్రధాన బలంగా మారింది. ఈ రెండు మూడు రోజులు స్టడీగా వుంటే, ఇంకో స్ట్రాంగ్ వీకెండ్ ‘కార్తికేయ-2’ సినిమాకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాల్లేకపోలేదు.

50 కోట్లు కొల్లగొడితే మాత్రం, ఈ క్లబ్‌లోకి తొలిసారిగా ఎంట్రీ ఇచ్చే అవకాశం నిఖిల్‌కి దక్కుతుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us