Karthikeya 2 : నాలుగు రోజుల్లో 35.1 కోట్లు: ఇదీ ‘కార్తికేయ-2’ సత్తా.!

NQ Staff - August 17, 2022 / 09:51 PM IST

Karthikeya 2 : నాలుగు రోజుల్లో 35.1 కోట్లు: ఇదీ ‘కార్తికేయ-2’ సత్తా.!

Karthikeya 2 : నిఖిల్ సిద్దార్ధ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ-2’ సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్‌తోపాటు ఇతర వెర్షన్లూ మంచి వసూళ్ళను రాబడుతున్నాయి. మరీ ముఖ్యంగా హిందీ వెర్షన్ అయితే వసూళ్ళ పంట పండిస్తోందనడం అతిశయోక్తి కాదేమో.

Karthikeya 2 Movie collections

Karthikeya 2 Movie collections

ఓవర్సీస్‌లో కూడా ‘కార్తికేయ-2’ వసూళ్ళ ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రోజే హిట్ టాక్ వచ్చినా, సినిమా వసూళ్ళు 20 కోట్లు దాటతాయా.? లేదా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపించాయి. కానీ, అంచనాలకు మించి ‘కార్తికేయ-2’ అదరగొడుతోంది.

నాలుగు రోజుల్లో అదరహో..

నాలుగు రోజుల్లోనే ‘కార్తికేయ-2’ సినిమా ఏకంగా 35.1 కోట్లు వసూలు చేసింది. ఇది గ్రాస్ లెక్క. ప్రపంచ వ్యాప్తంగా ఈ వసూళ్ళు సాధ్యమయ్యాయి. ఇంకా ‘కార్తికేయ-2’ జోరు కొనసాగుతూనే వుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ‘కార్తికేయ-2’ 50 కోట్ల క్లబ్బులోకి చేరిపోయే అవకాశాలూ లేకపోలేదు.

చాలా చోట్ల ‘కార్తికేయ-2’ సినిమాకి థియేటర్లు అదనంగా యాడ్ అవుతుండడం గమనార్హం. మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్‌కి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us