Karthikeya 2 : రేపు ‘కార్తికేయ-2’ మూడు వేల పైచిలుకు షోలు.!

NQ Staff - August 19, 2022 / 10:58 PM IST

Karthikeya 2 : రేపు ‘కార్తికేయ-2’ మూడు వేల పైచిలుకు షోలు.!

Karthikeya 2 : ఇది కదా.. అసలు సిసలు కిక్కు అంటే.! నిఖిల్ సిద్దార్ధ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ-2’ సినిమాకి తొలుత థియేటర్లు సరిగ్గా దొరకలేదు. కానీ, రోజురోజుకీ పరిస్థితులు అనుకూలంగా మారడం మొదలయ్యాయి. సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ నేపథ్యంలో, చాలా సినిమాలు పక్కకు తప్పుకున్నాయి.

Karthikeya 2 Movie bollywood release

Karthikeya 2 Movie bollywood release

హిందీ వెర్షన్ అయితే, దాదాపు 50 షోలతో ప్రారంభమయ్యింది తొలి రోజు ప్రదర్శనల పరంగా. కానీ, ఆ తర్వాత అనూహ్యంగా పరిస్థితులు మారాయి. రోజు రోజుకీ హిందీ వెర్షన్ థియేటర్ల కౌంట్ పెరుగుతూ వచ్చింది.

రేపు కొత్త చరిత్ర..

నిఖిల్ రేపు కొత్త చరిత్రను సృష్టించబోతున్నాడు. బాలీవుడ్ సినిమాలు ‘లాల్ సింగ్ చద్దా’, ‘రక్షా బంధన్’ (రెండు బాలీవుడ్‌కి చెందిన అగ్ర హీరోల సినిమాలే..) సుమారు మూడు వేల షోలు రేపు ప్రదర్శితం కానుండగా, ‘కార్తికేయ-2’ అంతకు మించిన సంఖ్యలో (3130) షోలు ప్రదర్శితం కానుంది.

ఇదీ ‘కార్తికేయ-2’ అంటే.. అంటూ తెలుగు సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేస్తోంటే, బాలీవుడ్ సినీ అభిమానులు.. తమ సినిమాలపైనా, తమ హీరోలపైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ ‘కార్తికేయ-2’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us