NTR : కర్నాటక రత్న పునీత్ కుమార్.. గొప్ప స్నేహితుడు, గొప్ప మనిషి: ఎన్టీయార్ భావోద్వేగ ప్రసంగం.!

NQ Staff - November 1, 2022 / 10:17 PM IST

NTR : కర్నాటక రత్న పునీత్ కుమార్.. గొప్ప స్నేహితుడు, గొప్ప మనిషి: ఎన్టీయార్ భావోద్వేగ ప్రసంగం.!

NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్, కర్నాటక వెళ్ళాడు. కర్నాటక రత్న ‘దివంగత’ పునీత్ రాజ్ కుమార్ గురించి ఎంతో భావోద్వేగంతో ప్రసంగించాడు. కర్నాటక రాజ్య ఉత్సవాల నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ సహా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కాగా, యంగ్ టైగర్ ఎన్టీయార్ తన ప్రసంగం ఆద్యంతం కన్నడంలోనే చేయడం గమనార్హం. పునీత్ రాజ్ కుమార్, యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి అత్యంత సన్నిహితుడు. చిన్న వయసులోనే గుండెపోటు కారణంగా కొన్నాళ్ళ క్రితమే పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే.

అహంకారం లేదు.. చాలా చాలా గొప్పవాడు పునీత్ రాజ్ కుమార్..

కన్నడ రత్న గౌరవం పునీత్ రాజ్ కుమార్‌కి దక్కడం ద్వారా ఆ గౌరవానికి మరింత గౌరవం పెరిగిందని యంగ్ టైగర్ ఎన్టీయార్ చెప్పుకొచ్చాడు. మంచి భర్త, మంచి తండ్రి, మంచి సోదరుడు, మంచి డాన్సర్, మంచి నటుడు, మంచి సింగర్.. వీటన్నిటినీ మించి పునీత్ రాజ్ కుమార్ మంచి మనిషి అని యంగ్ టైగర్ ఎన్టీయార్ కొనియాడాడు.
యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రసంగిస్తోంటే, పక్కనే వున్న రజనీకాంత్ క్లాప్స్ కొట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎన్టీయార్ మాట్లాడుతున్నంతసేపూ సభా ప్రాంగణం హోరెత్తిపోయిందనడం అతిశయోక్తి కాదేమో.
అంతకు ముందు కర్నాటకలో యంగ్ టైగర్ ఎన్టీయార్ కాలు పెట్టగానే, అక్కడాయనకు ఘన స్వాగతం లభించింది. పలువురు ప్రముఖులు ఆయన్ను సాదరంగా తమ వెంట తీసుకెళ్ళారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us