Kantara : ‘కాంతారా’ కోసం సిద్ధమేనా.? పోటెత్తనున్న వ్యూస్.!

NQ Staff - November 23, 2022 / 08:42 PM IST

Kantara  : ‘కాంతారా’ కోసం సిద్ధమేనా.? పోటెత్తనున్న వ్యూస్.!

Kantara  : అరరె.! థియేటర్లలో ఇంకా ‘కాంతారా’ వసూళ్ళ జాతర కొనసాగుతుండగానే, ఓటీటీలోకి వచ్చేయడమేంటి.? చాలామంది డౌటానుమానం ఇది.

‘ఇప్పటికే చాలా లేట్ అయ్యింది..’ అని కొందరు అంటోంటే, ఇంకో నెల రోజులు వేచి వున్నా నష్టమేమీ లేదన్నది మరికొందరి భావన. ఎవరి గోల వారిది.! ‘కేజీఎఫ్ ’ తర్వాత ఆ స్థాయిలో దేశాన్ని ఊపేసిన కన్నడ సినిమా ‘కాంతారా’.

అమేజాన్ ప్రైమ్‌లో వచ్చేస్తోంది..

ఈరోజు రాత్రి నుంచే ‘కాంతారా’ స్ట్రీమింగ్ కానుంది. అమేజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ జరుగుతుంది. నిజానికి, ముందే స్ట్రీమింగ్ స్టార్ట్ అయి వుండాలట. కానీ, థియేటర్ల వద్ద వసూళ్ళ ప్రభంజనం కొనసాగుతుండడంతో కాస్త ఆలస్యమయ్యిందన్నది ఓ వాదన.

ముందర జరిగిన ఒప్పందాల నేపథ్యంలో ఓ రెండు వారాల ముందే ‘కాంతారా’ ఓటీటీలో వచ్చేసి వుండాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ నటించిన ఈ ‘కాంతారా’ ఇంకా తెలుగునాట థియేటర్లలో సందడి బాగానే చేస్తోంది.

కొత్త సినిమాలతో పోటీ పడి మరీ ‘కాంతారా’ వసూళ్ళు రాబడుతున్నా, ఓటీటీలోకి వచ్చేస్తుండడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us