Kantara Movie : ఓటీటీలోకి ‘కాంతారా’.! కానీ, అది మిస్సయ్యిందే.!

NQ Staff - November 24, 2022 / 05:37 PM IST

Kantara Movie  : ఓటీటీలోకి ‘కాంతారా’.! కానీ, అది మిస్సయ్యిందే.!

Kantara Movie  : థియేటర్లలో చూసినవాళ్ళు కూడా ఇంకోసారి ‘కాంతారా’ సినిమాని ఓటీటీలో చూసేస్తున్నారు. ఇంకొన్నాళ్ళు ఆగి వస్తుందనుకున్న ‘కాంతారా’ అనూహ్యంగా ఓటీటీలోకి వచ్చేసింది. నిన్న సాయంత్రం నుంచీ, ‘కాంతారా’ని ఓటీటీలో చూసేందుకు ‘కాంతారా’ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు.

అర్థరాత్రి 12 గంటలు అవుతూనే, దాదాపుగా ‘కాంతారా’ అభిమానులంతా తమ ఇళ్ళల్లోని టీవీ సెట్లకు అతుక్కుపోయారు. ‘కాంతారా’ స్ట్రీమింగ్ షురూ అయ్యింది మొదలు, ‘కాంతారా’ సినిమాని పదే పదే ప్లే చేస్తున్న సినీ అభిమానులూ లేకపోలేదు.

కానీ, నిరాశే.. ఎందుకంటే..

‘కాంతారా’ సినిమా ఓటీటీలోకి వచ్చింది.. ఎడా పెడా దీన్ని చూసేస్తున్నారు. కానీ, అభిమానుల్లో ఏదో చిన్న నిరాశా. అదీ ‘వరాహ రూపం’ పాటకు సంబంధించి. ఈ పాట విషయమై కాపీరైట్ అభ్యంతరాలు రావడంతో, మార్క తప్పలేదు. మార్చిన పాట పెద్దగా ఎక్కడం లేదు.

‘మాకు ఒరిజినల్ పాట కావాలి..’ అంటూ రిషబ్ శెట్టి అండ్ టీమ్‌పై నెటిజన్లు డిమాండ్ల వర్షం కురిపిస్తున్నారు. కానీ, అది సాధ్యమయ్యే పనే కాదన్నది మెజార్టీ అభిప్రాయం.

రిషబ్ శెట్టి నటించిన ‘కాంతారా’ సినిమా థియేటర్లలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us