Kantara : కేజీఎఫ్ 2 అన్ని రికార్డులను కొల్లగొట్టేసిన కాంతార

NQ Staff - November 16, 2022 / 09:02 AM IST

Kantara : కేజీఎఫ్ 2 అన్ని రికార్డులను కొల్లగొట్టేసిన కాంతార

Kantara : కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసింది. రాబోయే రోజుల్లో కన్నడనాట ఏ ఒక్క సినిమా కూడా కేజీఎఫ్ 2 యొక్క రికార్డులను బద్దలు కొట్టే అవకాశం లేదని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బ్లాక్ బస్టర్ కాంతార సినిమా కేజీఎఫ్ 2 రికార్డులను బ్రేక్ చేసింది.

వెయ్యి కోట్ల వసూళ్లను అయితే కాంతార రాబట్టలేక పోవచ్చు. కానీ కర్ణాటకలో కేజీఎఫ్ 2 నమోదు చేసిన ప్రతి ఒక్క రికార్డును కూడా బ్రేక్‌ చేసి అద్భుతమైన సినిమా గా నిలిచింది. కర్ణాటకలో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమా గా నిలవడంతో పాటు అత్యధికులు చూసిన సినిమా గా కూడా రికార్డు నమోదు చేసింది.

ఏడాదిలో అత్యధిక రోజులు ఆడిన సినిమా గా కూడా కాంతార అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది అంటూ కన్నడ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్క కేజీఎఫ్ కన్నడ రికార్డును కాంతార బ్రేక్‌ చేసింది. ఓవరాల్‌ కలెక్షన్స్ రికార్డు మాత్రమే ఇప్పుడు కేజీఎఫ్ 2 కి మిగిలి ఉంది.

కాంతార సినిమా దాదాపుగా 400 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిన విషయం తెల్సిందే. భారీ బడ్జెట్ తో కాకుండా చిన్న సినిమా గా రూపొంది వందల కోట్లు వసూళ్లు నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదు. రిషబ్‌ షెట్టి తెరకెక్కించి నటించిన ఈ సినిమా అన్ని భాషల బాక్సాఫీస్ ల వద్ద కుమ్మేస్తోంది. త్వరలోనే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us