Kanika Kapoor And Gautam Hathiramani : అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోని పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ఊ అంటావా ఊఊ అంటావా అనే పాట దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. క్లాస్, మాస్ ఆడియన్స్ ఈ పాటకి తమదైన శైలిలో స్టెప్పులు వేశారు.
తెలుగులో ఊ అంటావా అనే సాంగ్‌ని ఇంద్రావతి ఆలపించగా, హిందీలో కనికా కపూర్ పాడింది. ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్‌తో ఉర్రూతలూగించిన ఈ అమ్మడు లండన్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్‌లో వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని పెళ్లాడింది. శుక్రవారం జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ఈ పెళ్లికి హాజరైన సింగర్ మన్మీత్ సింగ్ నూతన వధూవరులతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మీరెంత అందంగా ఉన్నారో మీరు కలిసి సాగించే జర్నీ కూడా అంతే అందంగా ఉండాలని కోరుకుంటున్నా అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాంట్రవర్సీస్‌తో ఎప్పుడు వివాదంలో నిలుస్తుంది కనికా. ఈ అమ్మడు 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని లండన్‌కు వెళ్లిపోయింది. ఆమెకు ఆయనా, సమర, యువరాజ్ అని ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలానికి దంపతుల మధ్య విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి పిల్లల బాధ్యతను కనికానే చూసు కుంటోంది.
- Advertisement -
లక్నోలో పెరిగిన ఆమె అప్పుడప్పుడూ తన తల్లిదండ్రులను చూసేందుకు భారత్‌కు వస్తూ ఉంటుంది. కాగా కనికా.. బేబీ డాల్, చిట్టియక్కలాయాన్, టుకుర్ టుకుర్, జెండా ఫూల్ పాటలతో జనాలను ఉర్రూతలూగించింది.