Kangana Ranaut : భయంకరమైన అనారోగ్య సమస్య బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చిన కంగనా!
NQ Staff - January 22, 2023 / 04:18 PM IST

Kangana Ranaut : బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ కంగనా రనౌత్ ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఈ అమ్మడు ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు స్టోరీకి ప్రాధాన్యమున్న పాత్రలకు కంగనా మొదటి ప్రాధాన్యం ఇస్తు వస్తుంది.. ఇదిలా ఉండగా నాలుగు పదుల వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా నాకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదని అంటోంది ఈ సంచలన బ్యూటీ.

Kangana Ranaut Posted An Emotional Post
కంగనా రనౌత్‌కు ఫైర్ బ్రాండ్ అని బాలీవుడ్లో పేరుంది. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఈ అమ్మడికి పద్మశ్రీని ప్రకటించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కంగనా.. దర్శక నిర్మాతలు, హీరోలనే కాకుండా పొలిటికల్ లీడర్స్‌ను కూడా ఓ ఆట ఆడుకుంటుంది. ఇక కంగనా ఏ విషయం మీద స్పందించినా ఆ విషయం ఖచ్చితంగా కాంట్రవర్సీ అవుతుంది..
ఇదంతా పక్కన పెడితే ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ లు ఒక్కొక్కరు ఒక్కో వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే.. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా హీరోయిన్స్ అంతా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాలను వెల్లడిస్తూ వారి ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు.. తాజాగా కంగనా రనౌత్ కూడా తనకు ఉన్న ఆరోగ్య సమస్య గురించి చెప్పింది..

Kangana Ranaut Posted An Emotional Post
సోషల్ మీడియా వేదికగా తనకు ఎదురైనా అనారోగ్య సమస్య గురించి కంగనా చెప్పుకొచ్చింది. నేను నటిగా ఎమర్జెన్సీ షూట్ కు గుడ్ బై చెప్పేసాను.. ఈ సినిమా షూట్ సమయంలోనే నా జీవితం ముగిసింది అని అనుకున్నాను.. కానీ నా ఆరోగ్య సమస్య గురించి ఎక్కడా నోరు విప్పలేదు.. నేను ఎంతగా బాధ పడుతున్న నా బాధ ఎవరికీ తెలియకూడదు అని అనుకున్నాను.

Kangana Ranaut Posted An Emotional Post
ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే.. మనం కష్టపడి పని చేయాల్సిందే అని.. అన్ని పరీక్షల్లో నెగ్గాల్సిందే.. నాకైతే మళ్ళీ చచ్చి పుట్టినట్టు అనిపిస్తుంది.. దీనికి సాయం చేసిన నా టీమ్ కు ధన్యవాదములు. నా గురించి కంగారు పడకండి.. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటూ ఈమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.
Such an overwhelming note from our director and producer as she wraps up the emergency schedule as an actor today. #Emergencythefilm #kanganaranuat pic.twitter.com/k9WmGl9MAB
— Manikarnika Films Production (@ManikarnikaFP) January 21, 2023