Kamal Haasan : దళపతి విజయ్‌కి విశ్వనటుడు కమల్ విషెస్.! ఏం జరుగుతోందబ్బా.?
NQ Staff - June 22, 2022 / 10:50 PM IST

Kamal Haasan : తమిళ నటుడు ‘దళపతి’ విజయ్ పుట్టినరోజు నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు, విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. అదీ ఫోన్ ద్వారా.

Kamal Haasan wishesh to Vijay on his birthday
విజయ్ – కమల్ మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయట.. ఫోన్ సంభాషణల్లోనే. అందులో రాజకీయాలకు ఏమన్నా అవకాశం దొరికిందా.? అనే విషయమై తమిళనాట చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కమల్ హాసన్, ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పార్టీతో ఆయనకు చేదు అనుభవమే మిగిలింది గత ఎన్నికల్లో.
విజయ్ కూడా రాజకీయాలపై కన్నేశాడుగానీ..
దళపతి విజయ్ కూడా రాజకీయాల గురించిన ఆలోచన చేశాడు, చేస్తూనే వున్నాడు. అయితే, తెగించి ఆయన రాజకీయాల్లోకి రాలేకపోతున్నాడు. రజనీకాంత్ అయితే పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించి, అంతలోనే తన నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.
మరి, విజయ్ సంగతేంటి.? కమల్ – విజయ్ చేతులు కలుపుతారా.? అంటే, రాజకీయాల సంగతేమోగానీ, కమల్ – విజయ్ కలిసి త్వరలో నటించబోతున్నట్లు ప్రచారమైతే గట్టిగా జరుగుతోంది.