Kamal Haasan : ‘విక్రమ్’ బ్రాండింగ్.! కమల్ కొత్త ఆలోచనలు అదుర్స్.!

NQ Staff - June 18, 2022 / 09:06 AM IST

Kamal Haasan : ‘విక్రమ్’ బ్రాండింగ్.! కమల్ కొత్త ఆలోచనలు అదుర్స్.!

Kamal Haasan : ‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పరచుకున్నాడు విశ్వనటుడు కమల్ హాసన్. ‘విక్రమ్’ సినిమా కమల్‌కి పదేళ్ళ తర్వాత నిఖార్సయిన హిట్టు ఇచ్చింది మరి. పాన్ ఇండియా స్థాయిలో ‘విక్రమ్’ వసూళ్ళ పంట పండిస్తున్న సంగతి తెలిసిందే.

Kamal Haasan want to do Vikram movies series

Kamal Haasan want to do Vikram movies series

‘విక్రమ్-2’ సినిమా కూడా చేస్తానని కమల్ మొన్నీమధ్యనే ప్రకటించాడు. లోకేష్ కనగరాజ్ కూడా, ‘విక్రమ్-2’ గురించి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా, కమల్ ఇంకో అడుగు ముందుకేసి, ‘విక్రమ్-3’ అంటున్నాడట. లోకేష్ కనగరాజ్ తదుపరి సినిమాకి తాను నిర్మాణం పరంగా సాయం చేస్తానని విక్రమ్ తాజాగా ప్రకటించడం గమనార్హం.

లోకేష్ తదుపరి సినిమా ఎవరితో.?

లోకేష్ కనగరాజ్ ఇప్పుడు ఇండియన్ సినిమాకి హాట్ ప్రాపర్టీగా మారిపోయాడు. తెలుగులో ముగ్గురు యంగ్ హీరోలు లోకేష్ వెంట పడుతున్నారు. పలు బ్యానర్లు లోకేష్‌తో ఒప్పందాలకు సిద్ధంగా వున్నాయి.
మరోపక్క, తమిళ దళపతి విజయ్ హీరోగా లోకేష్ ఓ సినిమా తెరకెక్కించాల్సి వుంది. ఆ సినిమా తర్వాతే లోకేష్ తన తదుపరి సినిమా మీద ఫోకస్ పెడతాడు.

కానీ, కమల్ హాసన్ మాత్రం, ‘విక్రమ్’ని ఓ బ్రాండ్‌గా మార్చేసి, ఆ బ్రాండ్ పేరుతో సిరీస్ ఆఫ్ మూవీస్ తీయాలనే ప్లాన్‌లో వున్నాడట. అందులో భాగంగానే విక్రమ్ వన్, విక్రమ్ టూ, విక్రమ్ త్రీ.. అని పేర్లు పెట్టుకుంటూ వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ, ఇదంతా సాధ్యమయ్యే పనేనా.? ఏమో, విశ్వనటుడికే తెలియాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us