Kamal Haasan : గురువు విశ్వనాథ్ సేవలో శిష్యుడు కమల్ హాసన్.!
NQ Staff - November 23, 2022 / 03:48 PM IST

Kamal Haasan : ఆయన విశ్వ నటుడే కావొచ్చు.. కానీ, గురువు ముందర శిష్యుడే కదా.! నిజానికి, కమల్ హాసన్‌కి గురువులు చాలామందే వున్నారు. ఆ గురువుల్లో మళ్ళీ ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ వెరీ వెరీ స్పెషల్.
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. విశ్వనాథ్ చిత్రాలకు కమల్ హాసన్ స్పెషల్ ఎట్రాక్షన్ అయితే.. కమల్ హాసన్ నటనకు పదును పెట్టింది విశ్వనాథ్ అని అనుకోవచ్చేమో.
గురువుని పరామర్శించిన శిష్యుడు..
కమల్ హాసన్ తాజాగా హైద్రాబాద్‌లోని విశ్వనాథ్ ఇంటికి వెళ్ళారు. గురువుని కలిసి నమస్కరించారు. గురువుగారి యోగ క్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు కమల్ హాసన్. శిష్యుడ్ని అలా చూసి విశ్వనాథ్ ఉప్పొంగిపోయారు.

Kamal Haasan Visited Vishwanath House in Hyderabad
గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యల వల్ల కె.విశ్వనాథ్ ఎక్కువగా బయటకు రావడంలేదు. వీల్ ఛెయిర్ మీదనే ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తోంది కూడా. విశ్వనాథ్ అంటే ఓ యూనివర్సిటీ.. అంటారు కమల్ హాసన్. అది నిజం కూడా.!
ఒకప్పుడు విశ్వనాథ్ సినిమాల్లో నటించడమంటే నటీనటులకు అదో వరం.! అదో అద్భుతం.