Kalyan Dev : మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్.!

NQ Staff - January 1, 2023 / 12:05 PM IST

Kalyan Dev : మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్.!

Kalyan Dev : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త, సినీ నటుడు కళ్యాణ్ దేవ్, సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

2022లో చాలా నేర్చుకున్నాననీ, సహనంగా వుండడమెలాగో తెలిసొచ్చిందనీ, ఎదగడం అంటే ఏంటో అర్థమయ్యిందనీ, అవకాశాల్ని అందుకోవడం, రిస్క్ తీసుకోవడం గురించీ తెలుసుకున్నాననీ పేర్కొన్నాడు సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్.

తప్పుల నుంచి నేర్చుకున్నా..

Kalyan Dev Posted An Emotional Post On Social Media

Kalyan Dev Posted An Emotional Post On Social Media

‘నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఇతరులను క్షమించడం.. నాతో నేను ఎక్కువగా గడపడం ఇలా ఎన్నో నేర్చుకున్నాను. ఈ ప్రయాణంలో నన్ను నేను మార్చుకునేలా సాయపడ్డ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు కళ్యాణ్ దేవ్.

గత కొంతకాలంగా కళ్యాణ్ దేవ్ – శ్రీజ ఒకరికొకరు దూరంగా వుంటున్నారు. ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, అధికారిక ప్రకటన అయితే ఏదీ రాలేదు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us