Kalyan Dev : మెగా అల్లుడి సినిమా అనాథ‌లా మారిందేంటి.. ప‌ట్టించుకునే వారే లేరుగా..!

Kalyan Dev : ఈ మ‌ధ్య కాలంలో సినిమా సెల‌బ్రిటీలు చిన్న చిన్న కార‌ణాల‌తో విడాకుల బాట ప‌డుతున్నారు. టాలీవుడ్ స్వీట్ కపుల్ నాగచైతన్య-సమంతల విడాకులతో తెలుగు ఇండస్ట్రీలో ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఒక్క సామ్-చైతూ మాత్రమే కాదు.. మరో పెద్ద ఫ్యామిలీలో కూడా మరో విడాకుల బాంబ్ పేలనుందని గాసిప్ రాయుళ్లు కథలు అల్లారు.

Kalyan Dev movie Super Machi releasing for sankranthi
Kalyan Dev movie Super Machi releasing for sankranthi

మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోనుందని ఈ జంట విడాకుల ఆలోచనలో ఉందని తీవ్ర ప్రచారం జరుగుతుంది. మెగా ఫ్యామిలీలో ఏ చిన్న వేడుకైనా అల్లుడు కళ్యాణ్ దేవ్ తప్పక ఉంటాడు. అయితే.. ఈ మధ్య జరిగిన సాయి ధరమ్ తేజ్ ఇంట్లో వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా మెగా హీరోలందరూ హాజరయ్యారు. కానీ ఇక్కడ కళ్యాణ్ దేవ్ మిస్సయ్యాడు. రీసెంట్‌గా జ‌రిగిన క్రిస్మ‌స్ వేడుక‌లోను క‌ళ్యాణ్ దేవ్ క‌నిపించ‌లేదు. దీంతో వారిద్ద‌రు విడిపోయార‌నే ప్ర‌చారం బాగా న‌డుస్తుంది.

ఇక క‌ళ్యాణ్ దేవ్ సంక్రాంతి కానుక‌గా సూప‌ర్ మ‌చ్చీ అనే సినిమాతో ప్రేక్ష‌కుల మందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి ఆద‌ర‌ణే క‌రువైంది. తెలుగు నాట ఏ చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ముందుకు వచ్చి ప్రమోట్ చేసి, తన వంతు సాయం చేస్తారు మెగాస్టార్ చిరంజీవి. అలాంటిది స్వయంగా ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సినిమాను మాత్రం ఎందుకనో అలా వదిలేసారు.

సూప‌ర్ మ‌చ్చీ సినిమాని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌బోతున్నారు అయితే ఈ హీరో ఎక్కడున్నారో తెలియదు. ప్రమోషన్ లకు ఆయన కనిపించడం లేదు. ఆఖరికి ట్రయిలర్ ను కూడా సింపుల్ గా వదిలేసారు. ఎవరెవరి ట్రయిలర్లు, టీజర్లు విడుదల చేసే మెగా ఫ్యామిలీ ఈ సినిమాపై క‌నీసం ఓ క‌న్ను కూడా వేయ‌లేదు. అస‌లు ఈ వ్య‌వ‌హారం గురించి అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

ఈ రోజు తం ట్రైలర్ ను వదిలారు. ఈ కథలోని వివిధ కోణాలను ట్రైలర్ ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ట్రైలర్ బాగుంది… ట్రైలర్ చూస్తుంటే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అని తెలుస్తోంది. హీరోను హీరోయిన్ రాముడిగా మార్చేస్తుందా ? లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా చేసుకుని కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ కథలో హీరోయిన్ ప్రేమని పొందలేకపోయిన అజయ్ .. విలన్ గా మారతాడని అర్థమవుతోంది.

రాజేంద్రప్రసాద్ .. తనికెళ్ల భరణి .. పోసాని .. ప్రగతి వంటి సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాకి ప్లస్ గా ఉన్నారు. “వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు సీతవు అవుతావో లేదో నాకు తెలియదు గానీ, వాడు మాత్రం రాముడు అవుతాడమ్మా” అనే రాజేంద్రప్రసాద్ డైలాగ్ బాగా పేలింది. ఈ సినిమా కల్యాణ్ దేవ్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.