Kalyan Dev : మరో పెళ్ళికి సిద్ధమవుతున్న శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్.? ఇదీ ట్విస్ట్ అంటే.!
NQ Staff - September 3, 2022 / 08:39 AM IST

Kalyan Dev : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, తన భర్త నుంచి విడాకులు తీసుకుందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి భర్త నుంచి కూడా ఆమె గతంలో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్‌ని పెళ్ళాడింది. కళ్యాణ్ దేవ్ పలు సినిిమాల్లో నటించిన విషయం విదితమే.

Kalyan Dev going to second marriage
ప్రస్తుతం శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ దగ్గర కాకుండా, తన తల్లిదండ్రుల దగ్గరే వుంటోంది. కళ్యాణ్ దేవ్ కూడా తన సొంత ఇంటికి వెళ్ళిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలతో కళ్యాన్ దేవ్ కెరీర్ అటకెక్కిందనుకోండి.. అది వేరే సంగతి.
విడాకులు తీసుకోకుండానే మళ్ళీ పెళ్ళి ప్రచారమేంటి.?
శ్రీజ నుంచి కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నాడా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదుగానీ, కళ్యాణ్ దేవ్ త్వరలో పెళ్ళి పీటలెక్కబోతున్నాడంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి.
బంధువుల అమ్మాయితోనే కళ్యాణ్ దేవ్ వివాహం జరగబోతోందట. అయితే, ఈ విషయమై ఇటు చిరరంంజీవి కుటుంబం నుంచిగానీ, అటు కళ్యాణ్ దేవ్ కుటుంబం నుంచిగానీ ఎలాంటి స్పందనా లేదు. కాగా, శ్రీజ మూడో పెళ్ళి.. అని కూడా గుసగుసలు వినిపిస్తున్న విషయం విదితమే.