Kajal : కేర్ అండ్ కేరెస్ : కాజల్ కొత్త బిజినెస్ అదిరింది బాస్.!

NQ Staff - September 22, 2022 / 08:00 PM IST

160157Kajal : కేర్ అండ్ కేరెస్ : కాజల్ కొత్త బిజినెస్ అదిరింది బాస్.!

Kajal : చందమామ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ భాషల్లోనూ కాజల్ అగర్వాల్ తనదైన ముద్ర వేయించుకుంది నటిగా. అలాగే, కాజల్‌కి బిజినెస్‌లోనూ సెపరేట్ టేస్ట్ వుంది.

Kajal new business is super

Kajal new business is super

చెల్లెలు నిషా అగర్వాల్‌తో కలిసి ఇప్పటికే కాజల్ రకరకాల ఆన్‌లైన్ బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టింది. ఆ రకంగా రెండు చేతులా సంపాదిస్తోంది కూడా. ఇక తాజాగా తన బిజినెస్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లే ఆలోచనలు చేసింది కాజల్ అగర్వాల్.

సరికొత్త బిజినెస్‌ని స్టార్ట్ చేసింది చందమామ. సమంత ప్రాణ స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి కాజల్ అగర్వాల్ ఓ కొత్త బిజినెస్‌లో అడుగు పెట్టింది. ఆ కొత్త బిజినెస్‌కి సరికొత్త పేరు కూడా పెట్టింది. అదే ‘కేర్ అండ్ కేరెస్ (Kare and Karess)’. ఇందులోని ‘K’ అంటే కాజల్ అండ్ కిచ్లూ అని అర్ధమట.

కాజల్ తెలివి తేటలు పోలా అదిరిపోలా.!

ఇంతకీ ఈ కొత్త బిజినెస్‌తో కాజల్ అగర్వాల్ ఏం చేయబోతున్నట్లు.? అంటే, బేబీ కేర్ ప్రొడక్ట్స్ అమ్మబోతోందట. బేబీ కేర్‌కి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట దొరికేలా ఈ సంస్థను ప్రారంభించిందట కాజల్ అగర్వాల్.

ఇటీవలే కాజల్ తల్లి అయిన సంగతి తెలిసిందే కదా. సో, బేబీ కేర్‌కి సంబంధించిన ఐటెమ్స్‌లో ఓ ఐడియా వుంటుంది. ఆ ఐడియానే తన స్టార్టప్ బిజినెస్‌గా మార్చేసుకుంది. వావ్.! చందమామ. అందంలోనే కాదు, తెలివితేటల్లో కూడా అని నెటిజన్లు కాజల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

అన్నట్లు కాజల్ అగర్వాల్, మళ్లీ షూటింగులతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ‘ఇండియన్ 2’ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు కాజల్ అగర్వాల్ ఇటీవలే ప్రకటించింది.