Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ కొడుకు కాలేజీకి.! వచ్చేవారమే వెళ్తాడట.!
NQ Staff - October 19, 2022 / 06:46 PM IST

Kajal Aggarwal : అరరె.! కాజల్ అగర్వాల్ కొడుకు అప్పుడే అంత పెద్దవాడైపోయాడా.? వచ్చేవారమే కాలేజీలో చేరిపోతాడా.? ఔను, కాజల్ అగర్వాల్ అలాగనే చెప్పుకొచ్చింది. ఆమె భర్త అలానే అంటున్నాడట.!
కోవిడ్ సమయంలో కాజల్ అగర్వాల్ పెళ్ళి పీటలెక్కింది.
పెళ్ళయ్యాకనే ఆమె ‘ఆచార్య’ సినిమాలో నటించింది. కానీ, ఆ సినిమాలోంచి ఆమె పాత్రని పూర్తిగా తొలగించేశారనుకోండి.. అది వేరే సంగతి. ఆర్నెళ్ళ క్రితమే కాజల్ అగర్వాల్‌కి కొడుకు పుట్టాడు.
జస్ట్ ఆర్నెళ్ళకే ఏ కాలేజీలో జాయిన్ చేస్తారబ్బా.?
కాజల్ భర్త గౌతమ్ కిచ్లు అంటున్నాడట, ‘వచ్చేవారమే మనబ్బాయ్ కాలేజీకి వెళ్ళిపోతాడు’ అని. అలాగని కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఓ ఎమోసనల్ నోట్ రాసుకొచ్చింది.

Kajal Aggarwal wrote Note On Social Media
‘బుజ్జికన్నా.. అప్పుడే నీకు ఆరు నెలల పూర్తయ్యాయ్.. ఏడాది పూర్తి చేసుకోవడానికి సగం సమయం మాత్రమే ఇంకా మిగిలి వుంది..’ అంటూ రోజులెంత వేగంగా గడిచిపోతున్నదీ చెప్పుకొచ్చింది.
తొలిసారి కింద పడటం దగ్గర్నుంచి, స్విమ్మింగ్ పూల్ సరదాలు.. ఆహారం తీసుకోవడం.. ఇవన్నీ చాలా ముచ్చటగా వున్నాయంటూ ‘పుత్రోత్సాహం’తో ఓ నోట్ రాసుకొచ్చింది సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్. తన కుమారుడి ఫొటోని కూడా షేర్ చేసింది కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో.