Kaikala Satyanarayana : ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు.!
NQ Staff - December 23, 2022 / 09:32 AM IST

Kaikala Satyanarayana : ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ, ఈ రోజు తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు.
ఎన్నో చిత్రాల్లో ఎన్నో అపురూపమైన పాత్రల్ని పోషించారు కైకాల సత్యనారాయణ. నవరస నటనా సార్వభౌమగా ఆయనకు తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు వుంది. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా.. ఇలా బోల్డన్ని పాత్రల్లో ఆయన మెప్పించారు.
తెలుగు తెరపై యముడిగా కైకాల స్పెషల్ బ్రాండ్..
తెలుగు తెరపై యముడి పాత్రలకు కైకాల సత్యనారాయణ తప్ప ఇంకొకరు తెలుగు సినీ ప్రేక్షకులకు గుర్తురారంటే అతిశయోక్తి కాదేమో. విలనిజం పండించాలన్నా, హాస్యం పండించాలన్నా.. అంతెందుకు, ఎమోషనల్ సీన్స్‌లో అయినా కైకాల సత్యనారాయణకు సాటి లేరు.
కైకాల సత్యనారాయణ రాజకీయాల్లోనూ రాణించారు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
అన్నట్టు, స్వర్గీయ ఎన్టీయార్‌కి డూప్‌గా కూడా కైకాల సత్యనారాయణ పనిచేయడం గమనార్హం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జులై 25న కైకాల సత్యనారాయణ జన్మించారు. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు.