Jayalakshmi : కే విశ్వనాథ్ భార్య కన్నుమూత.. భర్త వెంటే భార్య..!
NQ Staff - February 26, 2023 / 08:12 PM IST

Jayalakshmi : టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్ గానే కళా తపస్వి కే విశ్వనాథ్ మరణించిన విషయం తెలిసిందే. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించారు. అయితే ఈరోజు ఆదివారం ఆయన భార్య కూడా కన్నుమూశారు. జయలక్ష్మీ(86) గుండెపోటుతో చనిపోయారు.
భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె అస్వస్థతతో బాధ పడుతున్నారు. కాగా నేడు ఆదివారం ఆమెకు గుండెపోటు వచ్చి కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త మరణించిన 22 రోజులకే ఆమె కన్నుమూయడంతో ఆ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు ఆ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
భర్త చనిపోయి నెల రోజులు కూడా కాకముందే భార్య చనిపోవడంతో ఆ భర్త వెంటే ఆమె కూడా పయనం అయిపోయిందంటూ చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.