JR NTR : ఆస్కార్ బరిలో తారక్ అనేది వట్టిమాటేనా?

NQ Staff - August 14, 2022 / 02:09 PM IST

151590JR NTR : ఆస్కార్ బరిలో తారక్ అనేది వట్టిమాటేనా?

JR NTR : ఆస్కార్.. సినీ ప్రపంచంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఒక్కసారైనా దక్కించుకోవాలని కలలు గనే ప్రెస్టేజియస్ అవార్డు. ఆఖరికి నామినేషన్స్‌ లో చోటు దక్కినా కూడా గౌరవంగా భావిస్తారు. అలాంటి ఆస్కార్ బరిలో ఈ సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచాడన్న టాక్ సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరి అఫీషియల్ గా ఈ న్యూస్ అనౌన్సయిందా? ఏ ప్రాతిపదికన ఎన్టీఆర్  రేస్ లో ఉన్నాడంటూ కన్సిడర్ చేస్తున్నారు అనంటే.. రీసెంట్ గా ఓ ఫేమస్‌ హాలీవుడ్ సైట్ ఓ లిస్ట్ రిలీజ్ చేసింది. ఆ జాబితా ప్రకారం త్రిబులార్ లో భీమ్ గా ఎన్టీఆర్ నటనకు గానూ 2023లో ఆస్కార్ కంటెస్టెంట్ల లిస్ట్ లో ఉండొచ్చంటూ రాసుకొచ్చింది. ఇంకా ప్రాక్టికల్ గా చెప్పాంటే.. ఆ లిస్ట్ లో టాప్ 40 పోటీదారుల్లో తారక్ పేరు మెన్షన్ చేయలేదు. మేబీ అనే సెక్షన్ లో చేర్చారు. కేవలం ఆ న్యూస్ వైరలవ్వడంతోనే తారక్ ఆస్కార్ బరిలో ఉన్నాడంటూ కథనాలు స్టార్టయిపోయాయి.

JR NTR Joins Oscar List

JR NTR Joins Oscar List

ఓరకంగా త్రిబులార్ తర్వాత టీమ్ లో పనిచేసిన కాస్ట్ అండ్ క్రూకే కాదు.. ఓవరాల్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా వరల్డ్ వైడ్ గా మంచి గుర్తిపొచ్చింది. ప్రపంచం గర్వించదగ్గ మూవీమేకర్స్‌ నుంచి కూడా అప్రిసియేషన్స్‌ దక్కాయి. మరోవైపు జేమ్స్‌ బాండ్ రోల్ కు చరణ్ రోల్ కి తీసుకునే ప్లాన్స్‌ ఉన్నాయంటూ హాలీవుడ్ మూవీ మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

చరణ్‌ స్లిమ్ గా ఉంటాడు కాబట్టి ఆ పాత్రకి సీరియస్ గా కన్సిడర్ చేస్తారన్న హోప్స్‌ కూడా లేకపోలేదు. టాలీవుడ్ హీరోలకి ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ స్థాయి గుర్తింపు రావడం గర్వించదగ్గ విషయమే. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే.. తారక్ ఆస్కార్ లో లిస్ట్ ఉన్నాడంటూ స్పెక్యులేషన్స్‌ స్టార్టయినప్పటినుంచీ కొందరి ఫ్యాన్స్‌ లో మార్పొచ్చింది.

JR NTR Joins Oscar List

JR NTR Joins Oscar List

త్రిబులార్ లో చరణ్‌ కి ఎక్కువగా ఎలివేషన్స్‌ ఇచ్చారనీ, భీమ్ తో పోలిస్తే స్క్రీన్ స్పేస్ కూడా రామ్ పాత్రకే ఎక్కువగా ఉందంటూ మూవీ రిలీజైన కొత్తలో ఫీలయ్యారు నందమూరి అభిమానులు. కొందరయితే సపోర్టింగ్ క్యారెక్టర్ లా ఎన్టీఆర్ ని వాడుకున్నారంటూ జక్కన్నని ట్రోల్ చేశారు.
కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రని మా హీరో ఎన్టీఆర్ కి ఇచ్చాడంటూ రాజమౌళిని మెచ్చు కుంటున్నారు.
యంగ్ టైగర్ క్యాలిబర్ ని ప్రపంచం తెలుసుకునే స్థాయికి తీసుకెళ్లాడని హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఇక తారక్ ఆస్కార్ మ్యాటర్ కొస్తే

JR NTR Joins Oscar List

JR NTR Joins Oscar List

ఆ సైట్ రిలీజ్ చేసిన పేర్లు ఫైనల్ కావు. ఫర్ ఎగ్జాంపుల్.. ఆకాశమే నీ హద్దురా సినిమాకి సూర్య కూడా పోటీదారుల్లో ఒకడుగా ఉండబోవచ్చు అంటూ కొన్ని సైట్స్‌ రాశాయి ఇలాగే. దాంతో ఫ్యాన్స్‌ కూడా తెగ సంబరపడిపోయారు. కానీ ఫైనల్ గా మాత్రం ఆస్కార్ పోటీదారుల లిస్ట్ లోకి సూర్య ఎంటర్ కాలేదు. దాంతో డై హార్డ్ ఫ్యాన్స్‌ డిజప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ ఓ రకంగా జరుగుతోందదే.

కేవలం ఓ సైట్ రాసిన న్యూస్ ని బేస్ చేసుకుని, దానికే ఇప్పుడు హడావిడి, హంగామా స్టార్ట్ చేయడం తొందరపాటే. అఫ్ కోర్స్‌. భీమ్ గా తారక్ చేసిన పర్ ఫామెన్స్‌ కి ప్రతి ఆడియెన్ ఫిదా. ఖండాలు దాటి తెలుగు సినిమా జెండా ఎగరేయడంలో మనోడి కాంట్రిబ్యూషన్ పెద్దదే. ఒకవేళ ఆస్కార్ నామినేషన్ల అఫీషియల్ లిస్టులో యంగ్ టైగర్ ఉంటే అది ప్రౌడ్ మూమెంటే. టాలీవుడ్ రేంజ్ మరో మెట్టు పైకెక్కినట్టే. సో లెట్స్‌ వెయిట్ అండ్ సీ. హోల్డ్‌ ద సెలబ్రేషన్స్‌.