Jayasudha: జ‌యసుధ ఏంటి మ‌రీ ఇలా అయిపోయింది….!

Jayasudha: స‌హ‌జ న‌టి జ‌య‌సుధ ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించేది. కాని ఇటీవ‌ల ఆమె ముఖంలో క‌ళ తప్పింది. గుర్తు ప‌ట్ట‌నంత‌గా మారింది. ఆమ‌ని చూసిన వారంద‌రు జ‌యసుధ ఇలా అయిపోయారేంటి అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈమె ఇండియాలో లేరు. అమెరికాలో ఉన్నారు.

jayasudha new look
jayasudha new look

పద్నాగేళ్ల వయసులో స్క్రీన్‌పై కనిపించి, ‘సహజనటి’గా గుర్తింపు పొందారు జయసుధ. 45 ఏళ్లకు పైగా సాగుతున్న సినీ ప్రస్థానంలో భిన్న రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. అయితే గత కొన్నిరోజులుగా ఆమె వెండితెరకు దూరమయ్యారు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘మహర్షి’, బాలకృష్ణ ‘రూలర్‌’ తర్వాత జయసుధ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఈ మధ్య ఆమె ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారు. కొంతకాలంగా ఆమె ఆరోగ్యం బాగుండటం లేదని, అనారోగ్యం కారణంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

తాజాగా జ‌య‌సుధ‌ షేర్‌ చేసిన ఓ ఫొటో చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. నిండు మొహంతో కాస్తా లావుగా ఉండే జయసుధ, ఈ ఫొటోలో పీక్కుపోయి కనిపించారు. అంతేకాదు చాలా డిఫరెంట్‌గా కూడా ఉన్నారు. తన ట్విటర్‌లో ఫొటో షేర్‌ చేస్తూ.. ‘స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ’ అంటూ జయసుధ ట్వీట్‌ చేసింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెను చూసి షాకవుతున్నారు.

jayasudha new look2
jayasudha new look2

భర్త నితిన్ కపూర్ మరణం తర్వాత ఈమెకు సినిమాలపై ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ఈ మధ్యే జయసుధ కొడుకు నిహార్ కపూర్ గ్యాంగ్‌స్టర్ గంగరాజు అనే సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. మరోవైపు జయసుధ మాత్రం అమెరికాలోనే ఉండిపోయారు. అయితే ఈమె ఎందుకిలా మారిపోయిందనే విషయం మాత్రం అభిమానులకు అంతు చిక్కడం లేదు.