Jayamma Panchayathi : షూటింగ్‌లో సుమ‌కి త‌ప్పిన పెద్ద ప్ర‌మాదం.. కొద్దిగయితే..!

NQ Staff - May 7, 2022 / 01:13 PM IST

Jayamma Panchayathi  : షూటింగ్‌లో సుమ‌కి త‌ప్పిన పెద్ద ప్ర‌మాదం.. కొద్దిగయితే..!

Jayamma Panchayathi  : బుల్లితెరపై తెగ సంద‌డి చేస్తూ వెండితెర‌పై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న హీరోయిన్ సుమ‌. సీరియల్ నటిగా తెలుగు ప్రజలకు పరిచయం అయిన ఆమె ఎంతో కాలంగా తెలుగులో తిరుగులేని యాంకర్ గా తన ప్రస్థానం కొనసాగిస్తోంది. ఆమె అడపాదడపా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడమే కానీ ఇప్పటి వరకు నేరుగా ఏ సినిమాలో పూర్తి స్థాయి పాత్రలో నటించలేదు.

విజయ్ కుమార్ కలి వరపు అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో జ‌య‌మ్మ పంచాయ‌తీ అనే సినిమా చేయ‌గా, ఈ సినిమాలో మరో హీరోయిన్ ఎవరైనా నటించి ఉంటే ఇంత ప్రచారం జరిగి ఉండకపోవచ్చు. ఇండస్ట్రీలో అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ ఉంటే సుమ సినిమా చేసింది కాబట్టి సినీ పరిశ్రమలో అందరూ ముందుకు వచ్చి ఆమె సినిమాను ప్రమోట్ చేశారు, ఈ నేపథ్యంలో ఆమె నటించిన జయమ్మ పంచాయితీ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Jayamma Panchayathi Shooting Suma Slipped Fell During

Jayamma Panchayathi Shooting Suma Slipped Fell During

సుమ మూవీకి స్టార్ సపోర్ట్ బాగా లభించింది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్లలో పాలు పంచుకోగా, మరో ఇద్దరు స్టార్ హీరోలు సుమ కోసం రంగంలోకి దిగారు. నాని, నాగార్జున ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజ‌ర‌య్యారు. మ‌హేష్ బాబు మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. భాrరి  అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన ఈ చిత్రం ప‌ర్వాలేద‌న‌పించిది.

అయితే ఈ మూవీ చిత్ర షూటింగ్ స‌మ‌యంలో సుమ కాలు జారి కింద‌ప‌డింది. ఆ స‌మ‌యంలో ఆమెకు ఎలాంటి దెబ్బ‌లు త‌గ‌ల‌క‌పోవ‌డంతో అంద‌రు ఊపిరిపీల్చుకున్నారు. సుమ‌కి కాస్త గ‌ట్టిగా దెబ్బ‌త‌గిలితే న‌డుం విరిగేద‌ని కొంద‌రు అంటున్నారు.

ఒక విధంగా ఎప్పుడో దాసరి టైమ్ లో హీరోయిన్ గా సినిమా ప్రపంచం గురించి తెలియని రోజుల్లో ట్రయ్ చేసారు సుమ. ఇప్పుడు ఇన్నేళ్ల గ్యాప్ తరువాత ఈ రంగం గురించి క్షుణ్ణంగా తెలిసిన తరువాత మలి ప్రయత్నం చేసింది.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us