Janhvi Kapoor : జాన్వీ కపూర్: విటమిన్ ‘సి’ కోసం ఇంత గ్లామర్ ఒలకబోయాలా.?

NQ Staff - September 21, 2022 / 10:53 PM IST

Janhvi Kapoor : జాన్వీ కపూర్: విటమిన్ ‘సి’ కోసం ఇంత గ్లామర్ ఒలకబోయాలా.?

Janhvi Kapoor : అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌కి అదృష్టం కలిసి రావడం లేదు. ఏ రూపంలో దురదృష్టం అడ్డు పడుతుందో తెలీదు కానీ, అన్నీ కలిసొస్తే, ఈ పాటికి స్టార్ హీరోయిన్‌గా ఓ రేంజ్ వెలుగులు విరజిమ్మాల్సిన కెపాసిటీ వుంది.

Janhvi Kapoor new photos

Janhvi Kapoor new photos

కానీ, ఏం చేస్తాం. కొన్ని జీవితాలంతే.. అని సరిపెట్టుకోవల్సిందే. హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యి చాలా కాలమే అయ్యింది జాన్వీ కపూర్. కానీ, ఇంతవరకూ సరైన సినిమా ఒక్కటి కూడా పడలేదు జాన్వీ కపూర్‌కి. హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్‌తోనూ, కథా ప్రాధాన్యత వున్న సినిమాలతోనూ సరిపెట్టుకుంటోంది.

బాలీవుడ్ గిరిలో ఇరుక్కుపోయింది..

అలా ఆమె నటించిన సినిమాలు కేవలం వేళ్ల లెక్కకే సరిపోతాయంతే. ఒక్క కమర్షియల్ హిట్టు పడితే, జాన్వీ కపూర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. ఆ సంగతి అటుంచితే, ఎంత పిలిచినా ఆ బాలీవుడ్ బార్డర్ దాటి రానే రావడం లేదు జాన్వీ కపూర్.

కమర్షియల్ హీరోయిన్‌గా స్ర్కీన్‌పై సీను చూపించకపోయినా, సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ పక్కా కమర్షియల్. జాన్వీ కపూర్ నుంచి వచ్చే హాట్ ఫోటోలకు కుర్రకారు ఎప్పటికప్పుడే ఫిదా అయిపోతుంటారు. తాజాగా ‘విటమిన్ సి’ అంటూ ఓ కాన్సెప్ట్ ఫోటో షూట్ చేయించుకుంది జాన్వీ కపూర్.

ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్‌లో ధరించిన డ్రస్‌తో ఈ సరికొత్త ఫోటో షూట్‌‌తో టాప్ లేపేసింది. అదేనండీ భారీ క్లీవేజ్ సోయగాలతో రచ్చ చేసింది. విటమిన్ ‘సి’ అంటూ హెల్త్ అవేర్‌నెస్ కోసం చేసిన ఈ ఫోటో షూట్‌కి ఇంత హాట్‌నెస్ అవసరమా.? అంటూ కొందరు నెటిజన్లు జాన్వీ ఫోటోలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే, కళాపోషకులు ఎప్పటిలాగే జాన్వీ అందాలను ఆస్వాదిస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us