Veera Simha Reddy Movie : మళ్లీ థమన్ మార్క్ మాస్ దరువు.. జై బాలయ్య రచ్చ
NQ Staff - November 25, 2022 / 02:18 PM IST

Veera Simha Reddy Movie : నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ కార్యక్రమంలో దాదాపుగా పూర్తి అయ్యాయి అంటూ యూనిట్ సభ్యులు ఇటీవల అనధికారికంగా తెలియజేశారు.
ఈ సినిమా కు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు కలిసి రాబోతున్న విషయం తెలిసిందే.
ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా నుండి బాస్ పార్టీ అంటూ ఒక పాట వచ్చింది. సంక్రాంతికి పోటీ పడబోతున్న ఈ రెండు సినిమాలు పాటల విషయం లో కూడా పోటీ పడతాయి అన్నట్లుగా జై బాలయ్య సాంగ్ ని నేడు ప్రేక్షకుల ముందుకు తమను తీసుకొచ్చారు.
ఈ మధ్య కాలంలో దేవి శ్రీ ప్రసాద్ పై థమన్ పై చేయి సాధిస్తున్నాడు. ఈ విషయంలో కూడా తమన్ పై చేయి సాధించినట్లుగానే అనిపిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
జై బాలయ్య సాంగ్ నందమూరి అభిమానులతో పాటు మాస్ సాంగ్స్ ఇష్టపడే వారికి తెగ నచ్చేస్తుందట. అందుకే ఈ పాట సినిమా కు ప్రధాన ఆకర్షణ గా ఉంటుందని, బాక్సాఫీస్ ని షేక్ చేయడంలో కచ్చితంగా ఈ పాట ప్రధాన పాత్ర పోషిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.
అఖండ సినిమా లో తమన్ ట్యూన్ చేసిన జై బాలయ్య సాంగ్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ జై బాలయ్య సాంగ్ కూడా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని టాక్ వచ్చింది. కనుక సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.