Jacqueline Fernandez : బాలీవుడ్ భామ జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌పై తెలుగు మేకర్లు సమ్‌థింగ్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుంది. ఆయా సినిమాల కోసం అధికంగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసి, టాలీవుడ్‌కి పిలిచే ప్రయత్నాలు చేస్తున్నారట.


ఇప్పటికే తెలుగులో ‘సాహో’ సినిమాలో జాక్వెలీన్ నటించిన సంగతి తెలిసిందే. ‘బ్యాడ్ బాయ్’ సాంగ్‌లో ప్రబాస్ సరసన అందాల ఆరబోతతో రెచ్చిపోయింది జాక్వెలీన్ ఫెర్నాండెజ్. అయితే, ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి, ఆ ఫ్లేవర్ తీసుకురావడం కోసం జాక్వెలీన్‌ని ఈ సినిమాలో తీసుకున్నారని అనుకోవచ్చు.

పవర్ స్టార్‌తో యాక్షన్ కోసం
అయితే ఇప్పుడు మళ్లీ తెలుగులో సందడి చేసేందుకు ఈ శ్రీలంక బ్యూటీని ఎంగేజ్ చేశారట. ఇంతకీ ఏం సినిమా అంటారా.? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసమనీ గట్టిగా ప్రచారం జరుగుతోంది.

ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం, క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో జాక్వెలీన్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించనుందనీ తెలుస్తోంది. జాక్వెలీన్‌పై ఓ చిన్న యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారనీ తెలుస్తోంది. దాంతో పాటు, ఓ స్పెషల్ సాంగ్ కూడా వుండబోతోందట.
- Advertisement -

ఇక, జాక్వెలీన్ ఈ మధ్య ‘ఎటాక్’ అనే సినిమాలో నటించింది. జాన్ అబ్రహాం హీరోగా రూపొందిన ఈ సినిమాలో చీరకట్టులో కనిపించి కుర్రకారు గుండెల్ని సన్నగా కోసేసింది. తాజాగా ఇదే నేపథ్యాన్ని కంటిన్యూ చేస్తూ, కొన్ని చీరకట్టు ఫోటోలు తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది జాక్వెలీన్.
బ్లూ కలర్ సీక్వెన్స్ శారీలో జాక్వెలీన్ కట్టూ, బొట్టూ.. సింప్లీ సూపర్బ్ అనిపిస్తోంది.

హుందాగా కట్టిన చీర కట్టుకి, ఆ లెదర్ బెల్టు అదనపు ఆకర్షణ తెస్తోంది. ఆ చీర కట్టు, లెదరు బెల్టూ.. కుర్రకారు హృదయాల్ని సైతం అలాగే కట్టిపడేసిందీ శ్రీలంక బ్యూటీ జాక్వెలీన్.
