Jabardasth Panch Prasad : నడవలేని స్థితిలో జబర్దస్త్ ‘పంచ్ ప్రసాద్’.!
NQ Staff - November 18, 2022 / 08:49 PM IST

Jabardasth Panch Prasad : కమెడియన్‌గా బుల్లితెర వీక్షకులకు సుపరిచితుడైన పంచ్ ప్రసాద్, కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. కొంత కాలం క్రితం కిడ్నీ సమస్య అతనికి ఎదురైంది. కిడ్నీల పనితీరు క్రమంగా మందగిస్తూ వచ్చింది. కిడ్నీలు దాదాపుగా చెడిపోవడంతో కొంతకాలంగా ఆయన డయాలసిస్ మీదనే జీవితం వెల్లదీస్తున్నారు.
‘నవ్వు’కి వున్న మహత్మ్యం తెలుసు కదా.! తానెంత అనారోగ్యంతో బాధపడుతున్నా, ప్రాణాంతకమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నా, వేదికపై మాత్రం నవ్వులు పంచుతూనే వున్నాడు పంచ్ ప్రసాద్.
జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కమెడియన్..
మంచి టైమింగ్‌తో పంచ్ ప్రసాద్ వేసే పంచ్‌లకు బోల్డంత ఫాలోయింగ్ వుంది. అనారోగ్యంతో బాధపడుతూనే, చాలా ప్రోగ్రామ్స్‌లో పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు పంచ్ ప్రసాద్. అయితే, అనూహ్యంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించింది.
నడుం నొప్పి, జ్వరంతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్‌కి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించగా, నడుము భాగంలో ఇన్ఫెక్షన్ వచ్చినట్లు గుర్తించారు. మందులతో నయమవుతుందా.? సర్జరీ వరకు వెళుతుందా.? అన్నదానిపై వైద్యులు మరికొన్ని పరీక్షలు చేయాల్సి వుందట.

Jabardasth Panch Prasad Suffering From Infection In Waist
ప్రసాద్ కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రసాద్ అనారోగ్య పరిస్థితిపై మరో కమెడియన్ నూకరాజు ఓ వీడియో విడుదల చేశాడు.