Jabardasth Naresh : కన్నీళ్లు పెట్టించిన జబర్దస్త్ నాటీ నరేష్ లవ్ స్టోరీ
NQ Staff - September 9, 2022 / 11:21 AM IST

Jabardasth Naresh : జబర్దస్త్ కమెడియన్స్ యొక్క కష్టాలు చెబుతూ ఉంటే కన్నీళ్లు వస్తూ ఉంటాయి. వాళ్లు జబర్దస్త్ లోకి రాక ముందు పడ్డ కష్టం సినిమా కష్టాలను తలపిస్తూ ఉంటాయి. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత మాత్రమే తాము ఈ స్థాయికి వచ్చామంటూ ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్స్ తమ లైఫ్ హిస్టరీ చెప్పిన సందర్భంలో కన్నీళ్లు రావడం జరుగుతుంది.

Jabardasth Naresh real love story
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో నాటీ నరేష్ అదేనండి పొట్టి నరేష్ తన లవ్ స్టోరీని రివిల్ చేశాడు. కొన్నాళ్ళ క్రితం ఒక కార్యక్రమంలో డాన్స్ చేసిన సమయంలో ఒక అమ్మాయి వచ్చి తన ఇంప్రెస్ అయ్యాను అని ప్రేమిస్తున్నానంటూ చెప్పింది.
దాంతో నేను కూడా ఆమెను ఇష్టపడ్డాను.. ఆమెతో రొమాంటిక్ డాన్స్ లు కూడా చేశాను. ఆమెను నేను ప్రేమిస్తున్న సమయంలోనే ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా మాట్లాడడం గమనించాను.
ఆ విషయమే ఆమెను ప్రశ్నిస్తే పొట్టోడివి అంటూ అవమానించి నా నుండి వెళ్ళి పోయింది. నన్ను సాధ్యమైనంత వరకు వాడుకొని నా నుండి భారీ మొత్తంలో డబ్బు తీసుకొని నాతో ఈవెంట్స్ చేయించి డబ్బులు సంపాదించి వదిలేసింది.
ఈ మొత్తం విషయాన్ని తాజా ఎపిసోడ్ లో ఒక స్కిట్ గా నరేష్ చేసి చూపించాడు. ఇది తన రియల్ లైఫ్ స్టోరీ అంటూ అతడు చివర్లో చెప్పి అందరిని ఎమోషనల్ కి గురి చేశాడు.
తాజా ఎపిసోడ్ లో అతడి స్కిట్ హైలైట్ గా నిలిచింది అంటూ ప్రేక్షకుల అభిప్రాయం చేస్తున్నారు. తనలో ఉన్న లోపాన్ని ఇలా పాజిటివ్ గా మార్చుకొని కెరీర్ లో నిలిచిన నరేష్ ఎంతో మందికి ఆదర్శం అలాంటి వారిని మోసం చేయడం దుర్మార్గం అంటూ అభిమానులు నరేష్ కి మద్దతుగా ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఎవరు అనే విషయం మాత్రం నరేష్ క్లారిటీ ఇవ్వలేదు.