Rashmi Goutham : ఆ ఉద్యోగిపై యాక్ష‌న్ తీసుకోవాలంటూ సీఎంకు రిక్వెస్ట్ చేసిన రష్మీ..!

NQ Staff - January 29, 2022 / 11:03 AM IST

Rashmi Goutham : ఆ ఉద్యోగిపై యాక్ష‌న్ తీసుకోవాలంటూ సీఎంకు రిక్వెస్ట్ చేసిన రష్మీ..!

Rashmi Goutham : బుల్లితెర హాట్ యాంకర్ లలో రష్మీ గౌతమ్ ఒకరు. ఈమె కొద్దీ రోజుల్లోనే తెలుగు బుల్లితెర మీద టాప్ యాంకర్ లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. బుల్లితెర మీద జబర్దస్త్ షో తో ఎంట్రీ ఇచ్చింది.. ఈ షో ఈమె కెరీర్ కు చాలా హెల్ప్ అయ్యింది. ఈ షో ద్వారానే రష్మీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచి పోయింది. ఈమె జబర్దస్త్ షో తో భారీ ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది.

Jabardast anchor Rashmi Goutham complaint to CM

Jabardast anchor Rashmi Goutham complaint to CM

ఇంకా యూత్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే బుల్లితెర స్టార్ యాంకర్ గా వెలుగొందుతున్న ఈమెకు వెండి తెర మీద మాత్రం అనుకున్నంత క్రేజ్ రాలేదు.. ఈమె ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ ఈమె చేసిన పాత్రల వల్ల రష్మీ మీద బోల్డ్ ఇంప్రెషన్ పడింది. ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్ చేయడం వల్ల ఈమెకు ఇలాంటి ముద్ర పడింది.

దీంతో రష్మీ వెండి తెర మీద మళ్ళీ అవకాశాలు రాలేదు.. బుల్లితెర మీద నే షోలు చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దు గుమ్మా.. అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత రష్మీ వెండి తెర మీద ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. అది కూడా మెగా మూవీ తో రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో స్పెషల్ సాంగ్ తో పాటు, బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో హీరోయిన్ గా ఈ భామ నటిస్తుంది.

Jabardast anchor Rashmi Goutham complaint to CM

Jabardast anchor Rashmi Goutham complaint to CM

రష్మీకి మూగజీవాలు అంటే చాలా ఇష్టం.. ఈమె తరచు సోషల్ మీడియాలో చేసే పోస్టుల కారణంగా ఈ విషయం అందరికి తెలుసు. ఎక్కడైనా ఎవరైనా సరే మూగజీవిని హింసిస్తున్నారని రష్మీకి తెలిస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది. తాజాగా రష్మీ ఒక వీడియోను చూసి చాలా బాధ పడ్డారు. ఢిల్లీ జులో ఒక ఉద్యోగి ఒక జంతువును అకారణంగా కొడుతూ కనిపించాడు.

ఈ ఘటన మీద రష్మీ సీరియస్ అయ్యింది. మిమ్మల్ని చూస్తే సిగ్గుగా ఉంది.. అందుకే జూకు ఎవ్వరు వెళ్ళకండి.. ఈ జంతువులను వారు అక్కడ ఎంతలా హింసిస్తున్నారో ఆలోచించండి.. అరవింద్ కేజ్రీవాల్, మేనకా గాంధీ ఇలా ఈ ఇష్యుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ట్యాగ్ చేస్తూ రష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జూలను బ్యాన్ చేయండి.. మనం మూడు నెలలు లాక్ డౌన్ లో ఉంటేనే మెంటల్ ఎక్కింది.. మరి ఈ జంతువులు జీవితాంతం అలా జూ లోనే ఉంటాయి. ఇకపై వాటిని ఫ్రీగా ఉండనిద్దాం.. మీ పిల్లలను వినోదం కోసం జూ కు తీసుకెళ్ళకండి. అవి ఎంత నరకాన్ని అనుభవిస్తున్నాయో మీకు తెలియదు.. అంటూ రష్మీ ఎమోషనల్ ట్వీట్ చేసింది..

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us