Itlu Maredumilli Prajaneekam : అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఫస్ట్ లుక్ విడుదల.. ఆసక్తిరేపుతున్న పోస్టర్
NQ Staff - May 10, 2022 / 12:01 PM IST

Itlu Maredumilli Prajaneekam : టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కొన్నాళ్లుగా సక్సెస్‌లు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నాంది చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా సక్సెస్‌తో నరేష్ మంచి జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ఆనంది నాయికగా నటిస్తున్నది. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
రాజేష్ దండు ఈ చిత్ర నిర్మాత కాగా, బాలాజీ గుత్త సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం టైటిల్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేశారు. పోస్టర్ చూస్తే..అడవి మధ్యలో కొందరు గ్రామస్తులు పిల్లలతో సహా నిలుచుని ఉన్నారు. వారి ముందు ఓ యువకుడు బల్లెం పట్టుకుని ధైర్యంగా నిలబడ్డాడు. ఈ పోస్టర్ చూస్తే ప్రజానీకం తిరుగుబాటును కథలో చూపిస్తున్నట్లు అనిపించింది.
ఇక కొద్ది సేపటి క్రితం చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో నరేష్ చేతికి గాయాలతో కనిపిస్తున్నారు. ఈ సినిమా సరికొత్త కథతో రూపొందుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కూడా నరేష్‌కి మంచి హిట్ ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అల్లరి నరేష్ 59 వ చిత్రం గా వస్తున్న ఈ మూవీని హాస్య మూవీస్ మరియు జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Itlu Maredumilli Prajaneekam Releases First look
ఇదిలా ఉంటే అల్లరోడుగా జనం మదిలో నిలచిన నరేష్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ‘అల్లరి’ సినిమా విడుదలై మే 10వ తేదీకి ఇరవై సంవత్సరాలు అవుతోంది. హీరోగా నరేష్ కు, దర్శకునిగా రవిబాబుకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ‘అల్లరి’ చిత్రం 2002 మే 10న విడుదలయింది.
అల్లరి లాంటి కామెడీ సినిమాలతో నవ్వించి, గమ్యం, శంభో శివ శంభో లాంటి కొన్ని సినిమాలలో ఎమోషన్ తో కూడా కట్టిపడేసిన అల్లరి నరేష్ ఇండస్ట్రీకి పరిచయమై 20 ఏళ్ళు అయింది.