Varasudu : ‘వారసుడు’ దిల్ రాజుకి అప్పుడే లాభాల పంట పండిస్తోందా.?

NQ Staff - September 12, 2022 / 11:05 PM IST

158168Varasudu : ‘వారసుడు’ దిల్ రాజుకి అప్పుడే లాభాల పంట పండిస్తోందా.?

Varasudu : తమిళంలో ‘వారిసు’.. తెలుగులో ‘వారసుడు’. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తమిళ హీరో విజయ్ సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా నటిస్తోంది ‘వారసుడు’ సినిమాలో.  వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు.

Is the Varasudu Dil Raju getting profits

Is the Varasudu Dil Raju getting profits

కాగా, ‘వారసుడు’ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. దిల్ రాజు అప్పుడే ఈ సినిమాతో 185 కోట్లు సంపాదించేశాడట. తమిళనాడు, ఏపీ, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ విక్రయించకుండానే ఈ మొత్తం దిల్ రాజుకి వచ్చేసిందట.

అదెలా సాధ్యమయ్యిందంటే..

హిందీ డబ్బింగ్ అలాగే ఓవర్సీస్ రైట్స్ 64 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయట. డిజిటల్ అలాగే శాటిలైట్ మరియు ఆడియో రైట్స్ 120 కోట్లకు అమ్ముడు పోయారంటూ ‘వారిసు’ (వారసుడు)కి సంబంధించి ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారమే నిజమైతే, దిల్ రాజు పంట పండినట్లే. విజయ్ సినిమాలంటే, ఆ సినిమాల టాక్‌తో సంబంధం లేకుండా తమిళనాడులో వసూళ్ళు వచ్చేస్తుంటాయ్.. అనే భావన వుంది. ‘వారసుడు’ సినిమా విషయమై తెలుగులోనూ బోల్డంత ఆసక్తి కనిపిస్తోంది.

సో, హైప్ పెంచుకుంటూ పోతే, థియేట్రికల్ రైట్స్‌కి మరింత హాట్ రేట్స్ ముందు ముందు వచ్చే అవకాశముందన్నమాట.