Nithya Menon : నిత్యా మీనన్ పెళ్ళయిపోయిందా.? గర్భవతి కూడానా.?

NQ Staff - October 28, 2022 / 07:12 PM IST

Nithya Menon : నిత్యా మీనన్ పెళ్ళయిపోయిందా.? గర్భవతి కూడానా.?

Nithya Menon : సినీ నటి నిత్యా మీనన్ సోషల్ మీడియా వేదికగా అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. అసలు నిత్యా మీనన్ ఎప్పుడు పెళ్ళి చేసుకుంది.? అయినా, గర్భం దాల్చడానికి పెళ్ళితో పనేంటి.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.

ప్రెగ్నెన్సీ కిట్.. అందులో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసేలా కనిపిస్తున్న ఇండికేటర్.. వెరసి, చాలామంది షాక్‌కి గురయ్యారు నిత్యా మీనన్ సోషల్ మీడియా పోస్టింగ్ కారణంగా. అసలేమయ్యింది నిత్యామీనన్‌కి.? ఎందుకిలా చేస్తోంది.?

‘అండ్.. ది వండర్ బిగిన్స్..’ అర్థమేంటి..?

అసలు విషయాన్ని పరోక్షంగా పేర్కొంది నిత్యా మీనన్. ‘అండ్.. ది వండర్ బిగిన్స్..’ అంటూ క్యాప్షన్ పెట్టిందామె. ‘కంగారు పడకండి.. విపరీతార్థాలూ తీయకండి.. అది నిత్యా మీనన్ తదుపరి సినిమాకి సంబంధించి క్లూ..’ అంటూ కొందరు నెటిజన్లు అసలు విషయం బయట పెట్టేశారు.

సినిమా ప్రమోషన్ల కోసం ఇలా చేయాలా.? అభిమానులకు తప్పుడు సంకేతాలు పంపాలా.? అంటూ ఇంకొందరు నెటిజన్లు నిత్యా మీనన్‌ని ఏకి పారేస్తున్నారు.
మొన్నీమధ్యనే నయనతార – విఘ్నేష్ శివన్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. పెళ్ళయిన ఐదు నెలలకే ఈ జంటకి కవలలు జన్మించారు మరి.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us