Aishwarya Rai : బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాజీ మిస్ యూనివర్స్ కొద్ది దశాబ్ధాలుగా ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ అమ్మడి ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. దేవదాస్, ధూమ్ 2, జోధా అక్బర్, మోహబత్తేన్, గురు, గుజారిష్, తాల్, జోష్, రోబో, రావణ్, ప్రియురాలు పిలిచింది, సర్కార్ లాంటి ఎన్నో హిట్ చిత్రాలు ఐశ్వర్య రాయ్ ఖాతాలో ఉన్నాయి.

స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నారు. ఆపై ఆరాధ్యకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత ఐష్ సినిమాలు తగ్గించారు. ఫ్యామిలీ, కూతురు ఆద్యకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అందాల తార ఐశ్వర్యరాయ్ మరోసారి గర్భవతి అయ్యిందా? బచ్చన్ ఫ్యామిలీకి మరో వారసుడు రానున్నాడా అనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్య.. భర్త అభిషేక్, కూతురు ఆరాధ్యలతో కలిసి మీడియా కంటపడింది. ఆ సమయంలో ఒక్కసారిగా చేతిలో ఉన్న హ్యండ్‌బ్యాగ్‌ని ఐశ్వర్య పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుంది. అంతేకాకుండా కూతురు ఆరాధ్యను సైతం దగ్గరికి తీసుకుంది. దీంతో అందరిలో అనుమానాలు తలెత్తాయి. ఇక ఐశ్వర్య రాయ్ బచ్చన్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 నుండి తిరుగు ప్రయాణంలో కూతురు ఆద్య,భర్తతో కలిసి కెమెరాలకు చిక్కారు.
ఈ సందర్భంగా ప్రముఖ ఫోటోగ్రాఫర్, కంటెంట్ క్రియేటర్ వైరల్ భయాని… తాజాగా ఐశ్వర్య రాయ్‌కు సంబంధించి ఓ వీడియో పోస్టు చేశారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఐశ్వర్య తన పొట్ట కనిపించకుండా కవర్ చేసుకుంటూ వస్తోంది. దీంతో ఇప్పుడు ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్ ఆమె ప్రగ్నెంట్ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -
ఈ విషయంపై ఐశ్వర్యరాయ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో మరి. కేన్స్‌లో ఐష్ బ్లాక్ డ్రెస్ ధరించి సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌కి నిలువుటద్దంలా కనిపించింది. ఫొటోలకు పోజులిస్తూ అందరి హృదయాలను దోచుకుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తన చక్కని లుక్స్‌తో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫ్యాషన్ డ్రెస్సింగ్‌తో స్టన్నింగ్ లుక్స్‌తో అందరి చూపుని తనవైపుకి తిప్పుకుంది.