Ira Khan : ఫిట్‌నెస్ ట్రైనర్‌తో స్టార్ హీరో కూతురి ప్రేమాయణం.!

NQ Staff - September 23, 2022 / 06:35 PM IST

160335Ira Khan : ఫిట్‌నెస్ ట్రైనర్‌తో స్టార్ హీరో కూతురి ప్రేమాయణం.!

Ira Khan : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ గత కొంతకాలంగా ప్రేమాయణంలో మునిగి తేలుతోందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోన్న విషయం విదితమే.

Ira Khan fell in love with aamir khan's fitness coach

Ira Khan fell in love with aamir khan’s fitness coach

‘నాన్సెన్స్.. అలాంటిదేమీ లేదు..’ అంటూ ఆమిర్ ఖాన్ సన్నిహితులు కొట్టి పారేశారు. ‘అబ్బే, ప్రస్తుతానికి ప్రేమా గీమా లాంటివేం లేవ్..’ అని ఐరా ఖాన్ కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. అయితే, అది గతం. కొన్నాళ్ళుగా ఆమె సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడితో కలిసి వున్న ఫొటోల్ని షేర్ చేస్తూ వస్తోంది.

జస్ట్ ఫ్రెండ్షిప్ కాదు.. అంతకు మించి..

తొలుత ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారెతో తనది స్నేహమేనని చెప్పుకుంది ఐరా ఖాన్. కానీ, క్రమంగా ఆమె షేర్ చేస్తోన్న ఫొటోల ద్వారా ఇద్దరి మధ్యా ప్రేమ ఎంతలా బలపడుతోందో అందరికీ అర్థమయ్యింది.

ఇటీవల సైక్లింగ్ పోటీల కోసం నుపుర్ విదేశాలకు వెళ్ళగా, ఐరా కూడా అతనితోనే వెళ్ళడం గమనార్హం. ఈ క్రమంలో నుపుర్ ఆమెను హత్తుకుని ముద్దాడాడు కూడా.

అప్పుడే, ఐరా ఖాన్‌కి ప్రపోజ్ చేశాడు నుపుర్ శిఖారె. ఆల్రెడీ ప్రేమలో వున్నారు గనుక, ‘ఒప్పుకోవడం జస్ట్ ఓ ఫార్మాలిటీ’ అంతే. అలా ఇద్దరి మధ్యా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందట. ఇంతకీ, పెళ్ళెప్పుడు.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్సే.

బాలీవుడ్ స్టార్ కిడ్స్ ప్రేమాయణం పెళ్ళి పీటల వరకూ వెళ్ళడం ఒకింత ఆశ్చర్యకరమే.. అంటున్నారు బాలీవుడ్ జనాలు.