Priyanka Chopra : నల్లగా ఉన్నావంటూ అవమానించారు.. బాలీవుడ్ మీద ప్రియాంక చోప్రా ఫైర్..!
NQ Staff - June 4, 2023 / 10:02 AM IST

Priyanka Chopra : ప్రియాంక చోప్రా క్రేజ్ ఇప్పుడు ఎలాం ఉందో అందరికీ తెలిసిందే. ఆమె ప్రస్తుతం హాలీవుడ్ ను కూడా ఏలేస్తోంది. మొన్నటి వరకు బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా రాణించింది. బాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న స్టార్ హీరోయిన్ గా రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం భర్త నిక్ జోనస్ తో కలిసి యూఎస్ లోనే ఉంటుంది.
ఇక అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈ భామ.. తరచూ బాలీవుడ్ మీద ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా మరో ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె బాలీవుడ్ మీద ఫైర్ అయింది. ఆమె మాట్లాడుతూ.. స్టార్ డమ్ అనేది అంత ఈజీగా రాదు. దానికి ఎంతో కష్టపడాలి, అవమానాలు భరించాల్సి ఉంటుంది.
నేను బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మొదట్లో నల్లగా ఉన్నానంటూ చాలామంది అవమానించారు. ఛాన్సుల కోసం వెళ్తే డైరెక్టర్లు కొన్ని వల్గర్ కామెంట్స్ చేశారు. ఆ సమయంఓల చాలా బాధ పడ్డాను. కానీ ఆత్మవిశ్వాసంతోనే ఇంత వరకు వచ్చాను. ఇప్పుడు గ్లోబల్ సినిమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది.
ఇదంతా నా నమ్మకం వల్లే జరిగింది అంటూ ఎమోషనల్ అయింది ప్రియాంక చోప్రా. ఆమె చేసిన కామెంట్లకు కొందరు మద్దతు పలుకుతున్నారు. బాలీవుడ్ లో ఇలాంటివి బాగా పెరుగుతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రియాంక చోప్రా చేసిన కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి.